31 C
India
Monday, May 20, 2024
More

    ఎప్ప‌టికీ బీజేపీతోనే ఉంటా..!

    Date:

    bjp-shocked-raja-singh
    raja-singh
     బీజేపీ బ‌హిష్కృత ఎమ్మెల్యే రాజాసింగ్ త్వ‌ర‌లోనే తెలుగుదేశం పార్టీలో చేర‌తార‌నే ప్ర‌చారం ముమ్మ‌రంగా సాగుతున్న విష‌యం తెలిసిందే. ఆయ‌న తొంద‌ర‌నే టీడీపీలో జాయిన్ అయితార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. బీజేకీ నుంచి ఆయ‌న బ‌హిష్క‌ర‌ణ‌కు గురైన‌ప్ప‌టి నుంచి రాజాసింగ్‌ తీవ్ర మ‌నోవేద‌న‌లో ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. అందుకే ఆయ‌న రానున్న ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తార‌నే చ‌ర్చ ఉంది.

    అయితే త‌నపై వ‌చ్చిన ఈప్ర‌చారంపై ఎమ్మెల్యే రాజాసింగ్ క్లారిటీ ఇచ్చారు. తాను త్వ‌ర‌లోనే టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నట్లు వ‌స్తున్న వార్త‌ల‌ను ఆయ‌న ఖండించారు. త‌న‌పై బీజేపీ పార్టీ వేటు వేసిన‌ప్ప‌టికీ..తాను మాత్రం రానున్న ఎల‌క్ష‌న్స్‌లో భాజ‌పా త‌ర‌పునే ఎన్నిక‌ల బ‌రిలో ఉంటాన‌ని స్ప‌ష్టం చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి బీజేపీ నాయ‌క‌త్వం త‌న‌ను ద‌గ్గ‌రికి తీస్తుంద‌ని ఆశా భావం వ్య‌క్తం చేశారు.

    ప్ర‌స్తుతానికి తాను బీజేపీ జాతీయ నేత‌ల‌తో ట‌చ్‌లోనే ఉన్న‌ట్లు వెల్ల‌డించారు. కేంద్ర మంత్రుల‌తో కూడా అప్పుడ‌ప్పుడు మాట్లాడుతున్న‌ట్లు తెలిపారు. త‌నకున్న భావ‌జాలం ప్ర‌కారం వేరే ఏ ఇత‌ర పార్టీ కూడా త‌న‌ను చేర్చుకునే అవ‌కాశం లేద‌న్నారు. అంతేకాక తాను ఏపార్టీలో చేరేందుకు ఇష్ట‌ప‌డ‌డం లేద‌న్నారు. ఎన్నిరోజులైనా తాను బీజేపీలోనే కొన‌సాగుతాన‌ని స్ప‌ష్టం చేశారు. టీడీపీలో చేరుతాన‌ని వ‌స్తున్న ఆరోప‌ణ‌లు ప‌చ్చి అబ‌ద్ద‌మ‌ని కొట్టిపారేశారు.

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Madhavi Latha : ఓట్ల తొలగింపుపై న్యాయ పోరాటం చేస్తా: బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత

    Madhavi Latha : హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గం లో చాలా...

    Modi Nomination : ‘గంగా’ ఆశీస్సులతో మోడీ నామినేషన్.. భారీ ర్యాలీ..

    Modi Nomination : ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి నియోజకవర్గంలో మంగళవారం (మే...

    Kishan Reddy : రెండంకెల ఎంపీ స్థానాలు గెలుస్తాం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

    Kishan Reddy : రెండంకెల ఎంపీ స్థానాలు గెలిచి తెలంగాణలో బీజేపీ...