31.4 C
India
Monday, May 20, 2024
More

    Anasuya : అమెరికాలో హాట్ షోలో సందడి చేసిన అనసూయ

    Date:

    Anasuya
    Anasuya

    Anasuya  జబర్దస్త్ యాంకర్ గా చేసిన అనసూయ గుర్తింపు తెచ్చుకుంది. దాదాపు పదేళ్లు జబర్దస్త్ లో వ్యాఖ్యాతగా రాణించింది. తరువాత దానికి గుడ్ బై చెప్పి సినిమాల్లో వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. రంగస్థలంలో రంగమ్మత్తగా నటించి మెప్పించింది. తరువాత పుష్పలో దాక్షాయణిగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలా సినిమాల్లో తనదైన శైలిలో నటిస్తోంది. ఇప్పుడు అనసూయ ఓ మంచి నటిగా తన కెరీర్ ను మలుచుకోవడం విశేషం.

    అనసూయ ప్రస్తుతం అమెరికాలోని కాలిఫోర్నియాలో విహరిస్తోంది. కుటుంబంతో వెకేషన్ కు వెళ్లిన ఆమె ప్రొఫెషనల్ ఈవెంట్లలో పాల్గొంటోంది. ఓ మ్యూజిక్ చానల్ లో సందడి చేస్తోంది. ఆమె డ్రెస్సింగ్ కు అందరు ఫిదా అవుతున్నారు. ఇన్ స్టా గ్రామ్ లో తన ఫొటోలు షేర్ చేయడంతో వైరల్ గా మారాయి. దీంతో అభిమానుల కామెట్లు హల్ చల్ చేస్తున్నాయి. అనసూయ ఫొటోలు ఇప్పుడు సందడి చేస్తున్నాయి.

    ఇటీవల విడుదలైన రంగ మార్తాండ, విమానం చిత్రాల్లో కీలక పాత్రలు పోషించింది. కథలో ప్రాధాన్యమున్న పాత్రలు చేసి శభాష్ అనిపించుకుంది. రంగమార్తాండ సినిమాలో గడసరి కోడలు పాత్ర చేసి మెప్పించింది. విమానం సినిమాలో వేశ్య పాత్రలో నటించింది. స్లమ్ ఏరియాలో వ్యభిచారం చేసే పాత్రలో అనసూయ ఒదిగిపోయి నటించడంతో ఆమెకు ప్రతిష్ట పెరిగింది.

    పుష్ప 2లో పవర్ ఫుల్ పాత్ర చేస్తోంది. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల పెదకాపు సినిమాలో కూడా చేస్తోంది. విలేజ్ పొలిటికల్ డ్రామాగా పెదకాపు తెరకెక్కుతోంది. విజయ్ దేవరకొండతో ఉన్న విభేదాలు తారాస్థాయికి చేరినా తరువాత క్రమంలో సర్దుబాటు అయినట్లు కనిపిస్తోంది. సోషల్ మీడియా పుణ్యమాని వీరి మధ్య మొదలైన తగాదా సర్దుమణిగినట్లు తెలుస్తోంది.

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    America : అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ వాసి మృతి

    America : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువకుడు మృతి...

    H-1B Visa : హెచ్-1బీ వీసాదారులకు ఊరట – ఉద్యోగం కోల్పోయినా మరికొంత కాలం ఉండవచ్చు

    H-1B Visa : అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులకు ఊరట...

    Walmart Layoffs : లేఆఫ్ ప్రకటించిన వాల్ మార్ట్.. వందలాది మంది ఉద్యోగులు రోడ్డుపైకి..

    Walmart Layoffs : అమెరికాలోని వాల్ మార్ట్ తమ ఉద్యోగులకు భారీ...

    USCIS : USCIS కొత్త పెండింగ్ I-485 ఇన్వెంటరీ..

    USCIS : యూఎస్ లో శాశ్వత నివాసం కోరుతూ దాఖలు చేసే...