28.5 C
India
Sunday, May 19, 2024
More

    Rains Update: తెలుగు రాష్ర్టాల్లో కుండపోత.. వాతావరణ శాఖ కీలక అప్ డేట్

    Date:

    Rains
    Rains

    Rains update తెలుగు రాష్ర్టాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. అన్ని జిల్లాల్లో నదులు పోటెత్తుతున్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. చాలా ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జనజీవనం స్తంభించింది. ఇక తెలంగాణలో భారీ వర్షాలు ఎడతెరిపినివ్వడం లేదు. మరో వైపు బంగాళఖాతంలో వాయుగుండం ఏర్పడనుందనే వార్తల నేపథ్యంలో ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రభుత్వం ముందస్తు చర్యలకు దిగింది. తెలంగాణలో రెండు రోజుల పాటు స్కూళ్లకు సెలవులు ప్రకటించింది.

    వర్షం తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్నది. హైదరాబాద్ పై తీవ్ర ప్రభావం పడింది. నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతున్నది. అయితే ప్రస్తుతం వాయువ్య బంగాళఖాతంలో విస్తరించిన ఉపరితల ఆవర్తనం అల్ప పీడనంగా మారింది. దీని ప్రభావం కోస్తా, రాయలసీమలో పాటుగా తెలంగాణలోనూ పలు జిల్లాల్లోనూ హైదరాబాద్ నగరంలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అప్రమత్తం చేసింది. మరోవైపు తెలంగాణలో విద్యాసంస్థలకు ప్రభుత్వం ఈ రోజు రేపు సెలవులు ప్రకటించింది. హైదరాబాద్ లోని ఐటీ కంపెనీలకు ప్రత్యేక సూచనలు జారీ చేశారు. పలు కంపెనీల్లో ఉద్యోగులకు లాగౌట్ ప్రకటించారు. మూడు విడుతల్లో లాగాట్ చేయాలని పోలీసులు సూచించారు. ఐకియా సైబర్ టవర్స్ వరకు ఐటీ ఆఫీసుల్లో మధ్యాహ్నం 3 గంటలకు లాగౌట్ చేయాలని పోలీసులు ఆదేశించారు. ఐకియా నుంచి బయోడైవర్సిటీ వరకు ఐటీ కార్యాలయాల్లో సాయంత్రం 4.30 గంటలకు లాగ్ అవుట్ చేయాలని సూచించింది. ఫైనాన్షియల్ డిస్ర్టిక్ట్ లోని ఐటీ ఆఫీసుల్లో మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల మధ్య లాగ్ అవుట్ కావాలని పేర్కొన్నారు.

    అయితే మరో మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిశాయి. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. ఏపీలో అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి, పల్నాడు, కర్నూలు, నంద్యాలలో బుధ, గురువాల్లో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం సమాచారం. కొన్ని ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలో మీటర్లు వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బాడీగార్డు ఇంటిపై దాడి

    Pawan Kalyan : హైదరాబాద్ మీర్ పేటలోని లెనిన్ నగర్ లో...

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    Madhavi Latha : ఓట్ల తొలగింపుపై న్యాయ పోరాటం చేస్తా: బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత

    Madhavi Latha : హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గం లో చాలా...

    Heavy Rains : అప్ఘానిస్థాన్ లో  భారీ వర్షాలు.. 200 మంది మృతి

    Heavy Rains : అప్ఘనిస్తాన్ లో భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని...