39 C
India
Sunday, May 19, 2024
More

    Donald Trump : అమెరికాలో అంతర్యుద్ధం వస్తుందా! అసలు ఏం జరుగుతుంది?

    Date:

    Donald Trump jio bydan
    Donald Trump joe biden
    Donald Trump

    శతాబ్దాలుగా రాచరికాల్లో, నియంతృత్వాల్లో ప్రపంచం నలిగిపోయింది. మానవస్వేచ్ఛకు, హక్కులకు ఇది కరెక్టర్ కాదని ఒక్కొక్క దేశం నెమ్మదిగా ప్రజాస్వామ్యం వైపునకు అడుగులు వేస్తున్నాయి. ఈ ప్రక్రియ చాలా కాలం కొనసాగుతోంది. 200 ఏళ్లకు పైగా ప్రజాస్వామ్యంలో ఉన్న దేశం అమెరికా. ఇది ఎన్నో దేశాలకు మార్గదర్శకంగా నిలస్తూ వస్తోంది.

    అసలు ప్రజాస్వా్మ్యం అంటే ఏంటి? ‘ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకుడు ప్రజల కోసం పని చేయడం’. ప్రజలు ఎన్నుకున్న సమయంలో సేవకుడిగా పని చేయడం. ఒక వేళ ప్రజలు తిరస్కరిస్తే మౌనంగా తప్పుకోవడం తర్వాత వచ్చే నాయకుడికి బాధ్యతలు అప్పగించడం. ఇదీ ప్రజాస్వా్మ్యానికి అందంగా ఉంటుంది.

    కానీ దశాబ్దాలుగా అమెరికా ప్రజాస్వామ్య వ్యవస్థకు భ్రష్టు పట్టిస్తున్న నాయకుడు డొనాల్డ్ ట్రంప్ అంటూ వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. అతడు నియంతృత్వ పోకడ ఉన్న వ్యక్తి అని అమెరికన్స్ చెప్పుకుంటారు. ఓటమిని సైతం ఆయన అంగీకరించడని, తానే చక్రవర్తిగా ఫీల్ అవుతుంటాడని, ఇదే అక్కసుతో ప్రెసిడెన్షియల్ బిల్డింగ్ పై దాడి చేయించాడని అక్కడి వారు చెప్పుకుంటారు. ఇప్పటికి కూడా ప్రెసిడెంట్ ఎన్నికల్లో పోటీ చేసి గెలుస్తానని ధీమాతో ఉంటాడు.

    సాక్షాత్తు ప్రెసిడెన్షియల్ బిల్డింగ్ పై దాడి చేయించి జైలుకు వెళ్తానని భయం లేకుండా జో బైడెన్ కొడుకుపై నేరారోపణ చేస్తూ, ప్రెసిడెంట్ కుటుంబమే నేరాలకు పాల్పడుతుందని ప్రజలను నమ్మించాలని చూస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలు కాదు.. లాయర్లను పెట్టి మరీ కోర్టులో కేసులు నడుపుతున్నాడు. తనపై పెట్టిన కేసుల్లో పోరాడడానికి, బైడెన్ పై పెట్టిన కేసులను వేగంగా కదిపేందుకు ట్రంప్ లాయర్లపై ఖర్చు కొండంత ఖర్చు పెడుతున్నాడు.

    కొన్ని దేశాల్లో ప్రజాస్వామ్య ముసుగులో రాచరికం దాక్కొని ఉంటుంది. పైకి న్యాయం అందరికీ సమానమే అనుకున్నా.. అసలు విషయం పరిశీలిస్తే పదవి ఉన్నవాడికి ఒక న్యాయం, లేని వాడికి మరో న్యాయం ఇది అంతటా మామూలే. అది వాస్తవమేనైనా ఆ చట్టాలను తన చుట్టాలుగా మార్చుకోవాలనుకున్న ఉన్మాద స్థితికి చేరుకున్న వ్యక్తి అత్యంత ప్రమాధవంతుడు. తనకు పదవి ఉంటేనే దేశం లేదంటే వల్లకాడైనా పట్టించుకోని నియంతలు పుడతారు.

    ట్రంప్ వ్యవహారం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామ్యాలకు గుణపాఠం. ఇటువంటి ప్రజాస్వామ్య దేశాల్లో పుట్టుకొస్తే ఎలా నిలువరించాలో అర్థం కాదు. ఈ తరహా వ్యక్తులు తమ పంతం నెగ్గించుకునేందుకు ప్రజల్ని రెచ్చగొట్టి అంతర్యుద్ధాలకు తెరలేపగలరు.

    ట్రంపై మోపిక అభియోగాలను పరిశీస్తున్న కోర్టు తాను దోషి అని తేలితే జైలుకు పంపే ధైర్యం చేస్తుందా ఆ దేశం. అలా చేస్తే రిపబ్లికన్ అతివాదులు, ట్రంప్ అభిమానులు రెచ్చిపోయి విధ్వంసం సృష్టిస్తే ఆఫ్ఘనిస్తాన్ లాంటి వాతావరణం ఏర్పడడా? అదే గనుక జరిగితే అంతర్జాతీయంగా అమెరికా ఇమేజ్ ఏమౌతుంది? స్టాక్ మార్కెట్లు పరిస్థితి ఏంటి? ఆదేశం డాలర్ పై ఆధారపడిన అంతర్జాతీయ విపణి ఏమవుతుంది. ఇంత పెద్ద గొడవ జరగడం ఇష్టం లేదని కోర్టు శిక్ష నుంచి ట్రంప్ ను తప్పిస్తే అది ప్రజాస్వామ్యానికి అన్యాయం చేసినట్లు అవుతుంది. ఇక ట్రంపును ఆదర్శంగా తీసుకుంటే ప్రజాస్వామ్యదేశాల్లో నాయకులు కూడా నియంతృత్వ ధోరణి అవలంభించరా?

    ట్రంప్ కేసులపై తీర్పు కోసం ప్రపంచం యావత్తు చూస్తోంది. అక్కడి చట్టాల ప్రకారం ఈ కేసులో ట్రంప్ కు 20 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశముందని వాదనలు వినిపిస్తున్నాయి. అది జరుగుతుందా? ఏం జరుగుతుందో చూడాలి.

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    America : అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ వాసి మృతి

    America : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువకుడు మృతి...

    H-1B Visa : హెచ్-1బీ వీసాదారులకు ఊరట – ఉద్యోగం కోల్పోయినా మరికొంత కాలం ఉండవచ్చు

    H-1B Visa : అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులకు ఊరట...

    Walmart Layoffs : లేఆఫ్ ప్రకటించిన వాల్ మార్ట్.. వందలాది మంది ఉద్యోగులు రోడ్డుపైకి..

    Walmart Layoffs : అమెరికాలోని వాల్ మార్ట్ తమ ఉద్యోగులకు భారీ...

    USCIS : USCIS కొత్త పెండింగ్ I-485 ఇన్వెంటరీ..

    USCIS : యూఎస్ లో శాశ్వత నివాసం కోరుతూ దాఖలు చేసే...