28.5 C
India
Sunday, May 19, 2024
More

    Andhra Pradesh: పందులను కూడా వదలరా? ఏం మనుషులరా బై

    Date:

    Andhra Pradesh pig
    Andhra Pradesh pig

    Andhra Pradesh: కాదేది కవితకు అనర్హమన్నట్లు దొంగతనానికి కూడా ఏది అడ్డు కాదని చెబుతున్నారు. చోరీకి ఏదైనా ఏమిటని అనుకుంటున్నారు. కొందరు వస్తువులు దొంగతనం చేస్తే వీరు మాత్రం పందులను ఎత్తుకెళ్లడం గమనార్హం. చెడ్డీ గ్యాంగ్ తరహాలో ముసుగులు ధరించి బొలెరో వాహనంలో వచ్చి పందులను ఎత్తుకెళ్లిన సంఘటన చర్చనీయాంశంగా మారింది. దీనికి అనంతపురం జిల్లా వేదికైంది.

    అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం అమిద్యాలలో ముసుగు ధరించిన దొంగలు వింత దొంగతనానికి పాల్పడ్డారు. పందులను దోచుకెళ్లారు. అర్దరాత్రి గ్రామంలోకి ప్రవేశించి పుల్లమ్మ అనే మహిళకు చెందిన పందులను దోచుకెళ్లారు. గురువారం అర్థరాత్రి సమయంలో కొందరు గుర్తు తెలియని దొంగలు పందులను రోడ్డుపైకి తీసుకొచ్చారు. అనంతరం వాహనంలో ఎక్కించుకుని పారిపోయారు.

    మరసటి రోజు ఉదయం పుల్లమ్మ పందుల దొడ్డికి రాగా పందులు కనిపించలేదు. దీంతో చుట్టుపక్కల వారిని పిలిచి విషయం వివరించింది. దీంతో వారు సీసీ కెమెరాలు పరిశీలించగా అందులో వారు వచ్చిన ఆధారాలు కనిపించాయి. బొలెరో వాహనం నెంబర్ కూడా రికార్డు అయింది. దాని ఆధారంగా విచారణ చేపట్టారు. బాధితురాలి ఫిర్యాదు తీసుకుని గాలింపు చేపట్టారు.

    దొంగలు ఇలాంటి చీప్ దొంగతనాలు చేయడం ఇంతవరకు చూడలేదు. నీచంగా పందులను ఎత్తుకెళ్లడం చూస్తుంటే ఆశ్చర్యపోతున్నారు. పందులను ఎత్తుకుపోయి చీప్ మెంటాలిటీ బయట పెట్టారు. సైకిళ్లు, బండ్లు ఇతర వస్తువులను దొంగిలించే దొంగలను చూశాంకానీ పందులను దొంగిలించిన దొంగలను ఇప్పుడే చూస్తున్నాం. దీంతో వారిని వెతికే వేటలో పోలీసులు పడిపోయారు.

    Share post:

    More like this
    Related

    Kanguva : 10 వేల మందితో ‘కంగువా’ షూట్.. సూర్య-బాబీ డియోల్ క్లైమాక్స్ వార్ మూవీకే హైలట్..

    Kanguva : హీరో సూర్య నటించిన ‘కంగువా’ చిత్రం విడుదలకు సిద్ధం...

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Road Accident : పెళ్లి బట్టల కోసం వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం..

    - ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి Road Accident : ఆంధ్రప్రదేశ్...

    KCR Situation : చివరకు కేసీఆర్ పరిస్థితే జగన్ కు?

    KCR Situation :  రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. తెలంగాణలో...

    Polling in AP : ఏపీలో పెరిగిన పోలింగ్ ఎవరికి లాభం

    Polling in AP : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా అసెంబ్లీ,...

    LokSabha Elections 2024 : తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైన ఎన్నికలు

    LokSabha Elections 2024 : తెలుగు రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్...