39 C
India
Sunday, May 19, 2024
More

    Donald Trump : అమెరికాలో ట్రంప్ అరెస్ట్.. ఎందుకంటే..

    Date:


    Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2020 ఎన్నికలకు సంబంధించి ఫలితాల్లో జోక్యం, కుట్ర తదితర కేసుల కింద ఆయనపై కేసులు నమోదయ్యాయి. దీంతో ఆయన పోలీసుల ఎదుట లొంగిపోవాల్సి వచ్చింది. జార్జీయా రాకేటిరింగ్ కేసులో ఆయన జార్జియా పోలీసులకు సరెండర్ అయ్యారు.

    అయితే గతంలోనూ ట్రంప్ పై వివిధ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే ఆయన స్వయంగా పుల్టన్ కౌంటీ జైలుకు వెళ్లి లొంగిపోయాడు. ఆ తర్వాత 2 లక్షల డాలర్ల బాండ్ ను సమర్పించి బెయిల్ తీసుకునేందుకు అట్లాంటా పుల్టన్ కౌంటీ డిస్ర్టిక్ట్ అటార్ని అనుమతించారు. దీంతో ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు ట్రంప్ జైలుకు వెళ్లారు. ట్రంప్ పై నమోదైన నాలుగు క్రిమినల్ కేసుల్లో ఇదొకటి.  అయితే డొనాల్డ్ ట్రంప్ జైలులో 20 నిమిషాలు ఉన్న తర్వాత విడుదల అయ్యాడు. ఆ తర్వాత ఆయనకు బెయిల్ దొరికింది. అయితే తాను ఏ తప్పు చేయలేదని ట్రంప్ చెబుతున్నారు. కానీ అమెరికా చట్టాల ప్రకారం నేరారోపణలు ఉన్న వ్యక్తి ముందుగా లొంగిపోవాల్సి ఉంటుంది. దీనిని కూడా అరెస్ట్ గానే పరిగణిస్తారు.

    అయితే మరోసారి ఎన్నికల బరిలో నిలవాలని అనుకుంటున్న ట్రంప్ ఇలా కేసుల పాలవడం చర్చనీయంశంగా మారింది.  ఇది ఎన్నికల్లో ప్రభావం చూపుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఇవేమి ట్రంప్ పట్టించుకోవడం లేదు. తన పని తాను కానిచ్చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు తనదే అనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రజలంతా తనకు మద్దతునిస్తున్నారని తెలిపారు.

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    America : అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ వాసి మృతి

    America : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువకుడు మృతి...

    H-1B Visa : హెచ్-1బీ వీసాదారులకు ఊరట – ఉద్యోగం కోల్పోయినా మరికొంత కాలం ఉండవచ్చు

    H-1B Visa : అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులకు ఊరట...

    Walmart Layoffs : లేఆఫ్ ప్రకటించిన వాల్ మార్ట్.. వందలాది మంది ఉద్యోగులు రోడ్డుపైకి..

    Walmart Layoffs : అమెరికాలోని వాల్ మార్ట్ తమ ఉద్యోగులకు భారీ...

    USCIS : USCIS కొత్త పెండింగ్ I-485 ఇన్వెంటరీ..

    USCIS : యూఎస్ లో శాశ్వత నివాసం కోరుతూ దాఖలు చేసే...