39 C
India
Sunday, May 19, 2024
More

    Mahesh Vitta’s Marriage : ప్రియురాలితో బిగ్ బాస్ మహేష్ విట్టా పెళ్లి.. ఆమె బ్యాక్ గ్రౌండ్ తెలుసా..?

    Date:

    Mahesh Vitta’s Marriage :
    బిగ్ బాస్ ఫేమ్ మహేష్ విట్టా అంటే చాలా మందికి సుపరిచితమే.. టాలీవుడ్ కమెడియన్ గా కూడా అతి తక్కువ సమయం లోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న మహేష్ తాజాగా పెళ్లి చేసుకుని ఒక ఇంటి వాడు అయ్యాడు. ఈయన పెళ్ళికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..
    మరి పెళ్లి కూతురు ఎవరు? ఎవరిని మహేష్ పెళ్లి చేసుకున్నాడు? అనేది తెలుసుకుందాం.. మహేష్ విట్టా తాను ప్రేమించిన ప్రియురాలు శ్రావణి రెడ్డితో ఏడడుగులు వేసాడు.. సెప్టెంబర్ 2న వీరి పెళ్లి ఘనంగా జరిగింది.. మహేష్ విట్టా ఇంస్టాగ్రామ్ లో ఫోటోలు షేర్ చేయడంతో ఈ పెళ్ళికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.
    బిగ్ బాస్ సీజన్ 3 లో మహేష్ విట్టా కంటెస్టెంట్ గా పాల్గొని మంచి పాపులారిటీ దక్కించుకున్నాడు. అప్పుడే ఇతడు తన లవ్ స్టోరీ రివీల్ చేసాడు.. సుమారు ఐదేళ్లుగా వీరు ప్రేమించుకుని ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు.. మహేష్ విట్టా చెల్లెలి ఫ్రెండ్ నే శ్రావణి రెడ్డి.. ఈమె సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తుంది.. రెండేళ్ల స్నేహం తర్వాత ఈమె ప్రేమ ఒప్పుకుందని మహేష్ తెలిపాడు.
    ఇక మహేష్ విట్టా రాయలసీమ యాసలో మాట్లాడుతూ వీడియోలు చేసి ఫేమస్ అయ్యాడు.. ఫన్ బకెట్ వీడియోలతో ప్రేక్షకులకు దగ్గర అయ్యాడు. ఆ తర్వాత బిగ్ బాస్ 3 లో అవకాశం అందుకుని మరింత ఫేమస్ అయ్యాడు. ఇదే ఫేమ్ తో ఇతడు వరుసగా సినిమాల్లో కమెడియన్ గా అవకాశాలు అందుకుంటూ రాణిస్తున్నాడు.

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related