37.8 C
India
Saturday, May 18, 2024
More

    NTR31 : యంగ్ టైగర్ తో ప్రశాంత్ నీల్.. భారీ ప్రాజెక్ట్ 2024 నుంచి సెట్స్ పైకి..

    Date:

    NTR31
    NTR31

    NTR31 : ఎన్టీఆర్ మరోసారి వార్తల్లో నిలిచాడు. కేజీఎఫ్, కేజీఎఫ్-2, సలార్ వంటి బ్లాక్ బస్టర్స్ అందించిన ప్రశాంత్ నీల్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి ఒక సినిమాను ప్లాన్ చేశాడు.  అయితే ప్రస్తుతం యంగ్ టైగర్ కొరటాల శివతో కలిసి ‘దేవర’లో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేస్తామని మొదటి భాగాన్ని 5 ఏప్రిల్, 2024న విడుదల చేస్తామని ప్రకటించాడు.

    ఈ నేపథ్యంలో తన తదుపరి చిత్రం ప్రశాంత్ నీల్ తో ఉంటుందని #NTRNeel మేకర్స్ ప్రకటించారు. దేవర పూర్తయిన తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘#NTR 31’లో ఎన్టీఆర్ భారీ అవతారంలో కనిపించనున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ సెన్సేషన్ క్రియేట్ చేసింది.

    ‘@tarak9999 అండ్ #PrashanthNeel మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ 2024 ఏప్రిల్ లో ప్రారంభమవుతుంది. ప్రతిష్టాత్మక హై ఆక్టేన్ విజువల్స్ ఇండియన్ సినిమాలో కొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తాయి’ అన్నారు. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నాయి. ఈ చిత్రాన్ని కేజీఎఫ్ చిత్రాలతో సమానమైన స్థాయిలో నిర్మించాలని చిత్రబృందం భావిస్తోంది.

    ప్రశాంత్ నీల్ ఇప్పటికే కేజీఎఫ్, కేజీఎఫ్2 సక్సెస్ తో ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ లిస్ట్ లో ఉన్నాడు. ఇక ఆయన తదుపరి సినిమా ‘సలార్’ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలన్నీ హోంబలే నిర్మాణ సంస్థలో ఆయన చేశారు. ఇప్పుడు యంగ్ టైగర్ తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ కు ఈ చిత్రం చేస్తున్నాడు. వీరి కాంబోలో వచ్చే సినిమాకు భారీ అంచనాలే ఉంటాయనడంలో సందేహం లేదు.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Young Tiger NTR : ఆ భూమి విషయంలో కోర్టుకెక్కిన యంగ్ టైగర్.. చివరికి ఏమైందంటే?

    Young Tiger : ఓ భూవివాదంలో ఉపశమనం కోరుతూ జూనియర్ ఎన్టీఆర్...

    Jr NTR : ఆలయానికి భారీ విరాళం అందించిన యంగ్ టైగర్.. ఎంతంటే?

    Jr NTR : కోట్లాది మంది అభిమానుల చేత ‘మ్యాన్ ఆఫ్...

    RRR : ‘ఆర్ఆర్ఆర్’ హిందీ వెర్షన్.. రిలీజ్ ఎప్పుడంటే?

    RRR : ఒక్క పాటతో తెలుగు వారి కీర్తి, గౌరవాన్ని చాటిన...

    Jr. NTR : స్టయిల్ మార్చిన జూ. ఎన్టీఆర్

    Jr. NTR : ఎన్టీఆర్ స్టయిల్ మార్చారు. ‘వార్-2’ సినిమా షూటింగ్...