37 C
India
Friday, May 17, 2024
More

    Mrunal Thakur Wedding : మృణాల్ ఠాకూర్ పెళ్లి.. మెగా ప్రొడ్యూసర్ ఆశీర్వాదం..

    Date:

    Mrunal Thakur Wedding
    Mrunal Thakur Wedding Comments Allu Aravind

    Mrunal Thakur Wedding : నార్త్ ఇండియన్ బ్యూటీలు.. మలబార్ ముద్దుగుమ్మలు.. తమిళ అమ్మాయిలు.. కన్నడ కస్తూరిలకు కేరాఫ్ అడ్రస్ గా హైదరాబాద్ మారిపోయింది. టాలీవుడ్ లో చాన్స్ వచ్చిందంటే కాసుల వర్షం కురువడంతో పాటు కెరీర్ సెటిల్ అయిపోయినట్టేనని హీరోయిన్లు ఆశ పడుతుంటారు. టాలీవుడ్ నిర్మాతలు హీరోయిన్లకు ఇచ్చే రెమ్యూనరేషన్ తో సకల సౌకర్యాలు  ఓ రేంజ్ లో ఉంటాయి. అందుకే ఆ భామలు ఇక్కడి సినిమాలతో పాటు కొందరైతే ఇక్కడి కుర్రాళ్లనే పెళ్లి చేసుకుని స్థిరపడిపోతున్నారు.

    ఈ కోవకు చెందిందే లావణ్య త్రిపాఠి. ఈమె యూపీకి చెందిన ముద్దుగుమ్మ. తెలుగులో మంచి పేరే తెచ్చుకుంది. మంచి రూపంతో పాటు అభినయ పాటవాలు ఉన్న లావణ్యకు మంచి చాన్స్ లే వచ్చాయి. ఈక్రమంలో మెగా కుర్రాడితో లవ్ లో పడింది ఈ  బ్యూటీ. అయితే ఈ విషయం తెలిసో తెలియకో ..  ఓ మూవీ ఫంక్షన్ లో ‘‘నీకు హైదరాబాద్ కుర్రాడితోనే పెళ్లి అవుతుందని’’ ఆశీర్వదించాడు. అనుకున్నట్టుగానే ఆమె వరుణ్ తేజ్ ప్రేమ పెళ్లి దాక వెళ్లింది. నవంబర్ 1న ఇటలీలో కొణిదెల అబ్బాయి వరుణ్ తేజ్ తో పెళ్లి చేసుకోబోతున్నది.

    ఈ తరహాలోనే తాజాగా  సైమా అవార్డ్స్ వేడుకల్లో ‘సీతారామం’ మూవీకి గానూ మృణాల్ ఠాకూర్  బెస్ట్ యాక్టర్ గా అవార్డును సొంతం చేసుకుంది. ఈ అవార్డును ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఆమెకు అందించారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ.. మృణాల్  కూడా త్వరలో పెళ్లి చేసుకోవాలి..హైదరాబాద్ కుర్రాడితోనే ఆమె మ్యారేజ్ జరగాలని ఆశీర్వాదించాడు. ఆమె హైదరాబాద్ లోనే స్థిరపడాలని కోరుకుంటున్నట్టు వేదికపై వ్యాఖ్యానించారు. దీంతో ఆయన మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

    సీతారామం సూపర్ హిట్ తో బిజీ హీరోయిన్ గా మారిన మృణాల్ .. మరీ హైదరాబాద్ కుర్రాడిని పెళ్లి చేసుకుంటుందా.. అల్లు అరవింద్ మాటలు ఎంత వరకు నిజం అవుతాయో చూడాలని సినీ అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ముద్దుగుమ్మ మృణాల్ ను చేసుకోబోయే వాడు ఎవరోనని ఆరా తీస్తున్నారు. చూడాలి మరి మరికొన్ని సంవత్సరాలు హీరోయిన్ గా అలరిస్తుందా.. లేక రెండు మూడు ఏండ్లలోనే పెళ్లి చేసుకుని అత్తగారింట్లో అడుగుపెడుతుందా.. అని సినీ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Prabhas : కాబోయే భార్యను పరిచయం చేయబోతున్న ప్రభాస్.. ఇన్ స్టా పోస్టు వైరల్ 

    Prabhas : డార్లింగ్స్ ఫైనల్లీ సమ్ వన్ వెరీ స్పెషల్ పర్సన్...

    RCB : బెంగళూరు ప్లే ఆఫ్స్ చేరాలంటే.. 

    RCB : ఐపీఎల్ సీజన్ చివరకు దశకు చేరుకుంది. ప్లే ఆఫ్స్...

    Rashmika Mandanna : ముంబయి అటల్ సేతు పై రష్మిక మందన్న ప్రశంసలు.. మోదీకి ఫ్లస్ 

    Rashmika Mandanna : ముంబయి అటల్ సేతు పై హిరోయిన్  రష్మిక...

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బాడీగార్డు ఇంటిపై దాడి

    Pawan Kalyan : హైదరాబాద్ మీర్ పేటలోని లెనిన్ నగర్ లో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mrunal Thakur In Ethinc Wear