32.2 C
India
Friday, May 17, 2024
More

    BRS : ఆ గ్యాపే బీఆర్ఎస్ కొంప ముంచిందా? 

    Date:

    BRS
    BRS

    BRS: తెలంగాణ ఎన్నికల్లో భాగంగా మరో కీలక ఘట్టం నవంబర్ 30వ తేదీన జరగనుంది. ఈ సారి పోటీ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనేలా ఉంది. రెండు పార్టీల్లో ఏ పార్టీ గెలుస్తుందన్న అంచనాలు ప్రజలతో పాటు రాజకీయ నాయకుల్లో ఉత్కంఠత పెంచుతున్నాయి. ఐదు రోజుల్లో ప్రచారం ముగియనుండగా.. తొమ్మిది రోజుల్లో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ గెలుపు తమదే అంటే తమదే అంటూ ధీమాగా ఉండగా బీజేపీ సామాజిక సమీకరణాలు కలిసి వస్తాయని నమ్ముతోంది.

    హోరా హోరీ..
    గెలుపు కాంగ్రెస్ కు అనుకూలంగా కనిపిస్తుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మౌత్ పబ్లిసిటీ కూడా బీఆర్ఎస్ కంటే ఎక్కువగా కాంగ్రెస్ వైపునకే ఉంది. కర్ణాటక తర్వాత తెలంగాణపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ అధినాయకత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన చిన్న తప్పున కూడా పెద్ద ప్రచార అస్త్రంగా మార్చుకుంది. దీంతో బీఆర్ఎస్ కామన్ గానే ఆత్మరక్షణలో పడింది. అధికారం తమదే అన్న అనే భావన ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కాంగ్రెస్ సక్సెస్ అయ్యింది.

    కాంగ్రెస్ వ్యూహం కలిసొచ్చిందా
    కాంగ్రెస్ మొదటి నుంచి బీఆర్ఎస్ ను పక్కా వ్యూహంతో ముందుకెళ్తుంది. కేసీఆర్ గెలుపుపై అంత ధీమా ఉంటే సిట్టింగ్ లతో బరిలోకి దిగాలని సవాల్ విసిరింది. బీఆర్ఎస్ కూడా సిట్టింగులకే సీట్లు కేటాయించింది. అయితే ఇంటలీజెంట్, గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం.. సిట్టింగులపై తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ విషయంలో కాంగ్రెస్ వ్యూహం పారింది.

    కీలకమైన సమయంలో (షెడ్యూల్ అనౌన్స్) కేసీఆర్ అస్వస్థతకు గురి కావడంతో ఆ సమయాన్ని కాంగ్రెస్ చక్కగా వినియోగించుకుంది. కాంగ్రెస్ ఏం చెప్పినా ప్రజలు నమ్మరనే అతి విశ్వాసాన్ని గట్టిగా నమ్మిన కేసీఆర్ సైలంట్ అయ్యారు. దీంతో మంచి ఊపు మీదున్న కాంగ్రెస్ బంతిని తమ కోర్టులో వేసుకుంది. ఏది ఏమైనా కేసీఆర్ ప్రసంగాల్లో ఊపు లేకపోవడం కేటీఆర్ ఊకదంపుడు ఉపన్యాసాలకు ప్రజలు విశ్వసించకపోవడం.

    Share post:

    More like this
    Related

    Jagtial District : జగిత్యాల జిల్లాలో విషాదం.. అన్నదమ్ములను బలిగొన్న భూ వివాదం

    Jagtial District : భూ వివాదంలో జరిగిన గొడవ ఇద్దరు అన్నదమ్ములను...

    SIT Investigation : ఏపీలో హింసపై సిట్ దర్యాప్తు

    SIT Investigation : ఏపీలో ఎన్నికల ముందు, తర్వాత జరిగిన హింసపై...

    America : అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ వాసి మృతి

    America : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువకుడు మృతి...

    Tirumala Ghat Road : తిరుమల ఘాట్ రోడ్డులో తప్పిన ప్రమాదం

    Tirumala Ghat Road : తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో పెను...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Vijayashanthi-KCR : రాముల‌మ్మకు కేసీఆర్ గుర్తుకు వస్తున్నారా.. ఆ ట్వీట్ అర్థం ఏంటో?

    Vijayashanthi-KCR : బీఆర్ఎస్‌ పార్టీపై సినీ నటి, రాజకీయ నాయకురాలు  విజయశాంతి...

    BRS : వద్దన్నా వినలేదు..అందుకే రావట్లేదు

    BRS : వరంగల్, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం వాస్తవానికి ...

    Congress : కాంగ్రెస్ నాయకులకు సోకిన ఎన్నికల జ్వరం 

    Congress : తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ నాయకులకు పార్లమెంట్ ఎన్నికల జ్వరమే...

    KCR : కేంద్రంలో వచ్చేది ఆ ప్రభుత్వమే..: కేసీఆర్

    KCR : కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో బీఆర్ఎస్...