36.9 C
India
Sunday, May 19, 2024
More

    Sairat Marathi Movie : ఇది చిన్న సినిమా కాదు బ్రో.. ఏకంగా ప్రభుత్వమే దిగొచ్చింది!

    Date:

    Sairat Marathi Movie
    Sairat Marathi Movie

    Sairat Marathi Movie : ఏదో ఓ సినిమాలే.. అని తేలిగ్గా అనుకుంటాం. కానీ సినిమాకున్నంత పవర్ దేనికీ ఉండదు. సినిమా అంటే ఎంటర్ టైన్ మెంట్ తో ఓ ఎమోషన్. ఇండియాలాంటి దేశాల్లో సినిమా అంటే జీవితం. తారలు మన ఆరాధ్యాలు. అలాంటి సినిమాను తక్కువ అంచనా వేయవద్దు. తాజాగా తెలుగులో వచ్చిన ‘బలగం’ మూవీ చిన్న సినిమాగా వచ్చింది. కానీ ఎంత పెద్ద హిట్ అయ్యింది. ఈ సినిమాను చూసి విడిపోయిన బంధాలు కలిసిపోయాయి. వెనకటి కాలంలో లాగా ఎడ్లబండ్లు, ట్రాక్టర్లలో వచ్చి మరీ సినిమా చూశారు. ఊళ్లలో, మండల కేంద్రాలో ప్రత్యేక తెరలు కూడా  వేసి సినిమా చూపించారు. అలాగే మరాఠిలో కూడా ఓ చిన్న సినిమా పెద్ద సంచలనమే రేపింది. ఊహించని రీతిలో రూ.100కోట్ల క్లబ్ లో చేరింది. అలాగే ఆ మూవీని చూసి ప్రభుత్వం ఏకంగా ఓ చట్టమే తెచ్చింది. ఏంటా సినిమా? ఏంటా కథా? చదవండి మరి..

    కులాంతర వివాహం నేపథ్యంలో మరాఠి భాషలో వచ్చిన మూవీ ‘‘సైరత్’’. ఈ మూవీ 4కోట్లతో తెరకెక్కించారు. 2016లో రిలీజై రూ.100కోట్లు వసూలు చేసింది. మూవీలో ఆకాశ్ థోసర్, రింకు రాజ్ గురు జంటగా నటించారు. డైరెక్టర్ నాగరాజు మంజులే. ఈ మూవీలో ప్రతీసాంగ్ సూపర్ హిట్టే. దీన్ని పలు భాషల్లోకి రీమేక్ చేశారు. ఇక కథలోకి వెళ్తే..

    ప్రశాంత్(హీరో) తక్కువ కులానికి చెందిన యువకుడు. అతడి తండ్రి మత్స్య కారుడు. ప్రశాంత్ చదువులో నంబర్ వన్.. అలాగే లోకల్ క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా ఉంటాడు. ఇక అర్చన(హీరోయిన్) ధనిక, అగ్రవర్ణ భూస్వామి, రాజకీయ వేత్త కుమార్తె. వీరిద్దరూ కాలేజీలో చదువుతున్నప్పుడు ప్రేమలో పడతారు. అర్చన తమ్ముడి పుట్టిన రోజు వేడుకలో.. ప్రశాంత్, అర్చన పెరట్లో కలుసుకుంటారు. వారిని అర్చన కుటుంబం చూస్తుంది. ఆమె తండ్రి, మిగతా కుటుంబ సభ్యులు ప్రశాంత్ ను కొడతారు. పెద్దవాళ్లు పెళ్లికి అంగీకరించరని ప్రశాంత్ , అర్చన సిటీకి పారిపోతారు. ఆ తర్వాత ఏం జరిగిందనేదే మిగిలిన స్టోరీ.

    సైరత్ సినిమా ప్రేరణతో మహారాష్ట్ర ప్రభుత్వం కులాంతర వివాహాలను ప్రోత్సహించడానికి ఓ చట్టం తీసుకురావడం విశేషం. కులాంతర వివాహం చేసుకున్న వాళ్లకు ప్రోత్సహకాలు కూడా అందించింది. అలాగే వారిలో ఒకరికి జాబ్ కూడా ఇవ్వాలనే ప్రతిపాదన తెచ్చింది.

    ఇలాంటి కథలు మన దగ్గర కూడా చాలానే వచ్చాయి. జయం, ఉప్పెన.. ఇలాంటి తరహ కథలే. ఇవి సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి. కాకపోతే ఎలాంటి భారీ కాంబినేషన్ లేకుండా ఏడేళ్ల కింద మరాఠి భాషలో 100కోట్లు వసూలు చేయడమే విశేషం.

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related