32.6 C
India
Saturday, May 18, 2024
More

    KTR : తెలంగాణ భవిష్యత్ ఇలానే ఉండబోతుందా..? కేటీఆర్ సంచలన ట్వీట్

    Date:

    ktr
    KTR

    KTR : కర్ణాటక సీఎం సిద్ద రామయ్యపై కేటీఆర్ చేసిన ట్వీట్ తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతుండగా.. కర్ణాటక సీఎం సిద్ద రామయ్య రీ ట్వీట్ కేటీఆర్ ను ఇబ్బందుల పాలు చేశాయి. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తెలంగాణలో కూడా మేనిఫెస్టోలో పెట్టారు. ఆ హామీలను చూసిన ఓటర్లు కాంగ్రెస్ కు అధికారం కట్టబెట్టారు. వాటిని అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కసరత్తు చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో కర్ణాటక అసెంబ్లీలో సిద్ద రామయ్య మాట్లాడిన మాటలు ఇటీవల వైరల్ అయ్యాయి. ఆ వీడియోను ట్యాగ్ చేస్తూ కేటీఆర్ ఎక్స్ (ట్విటర్)లో ట్వీట్ చేశారు.

    ‘ఎన్నికల్లో ఓట్ల కోసం అది ఇస్తాం.. ఇది ఇస్తాం.. అని హామీ ఇచ్చినంత మాత్రాన అన్నీ ఇచ్చుకుంటూ పోతామా? మాకూ ఇవ్వాలనే ఉంది. కానీ ఖజానాలో డబ్బులు లేవు. డబ్బులు ఎక్కడినుంచి వస్తాయి’ అంటూ సిద్ద రామయ్య కర్ణాటక అసెంబ్లీలో అన్నట్లుగా ఉంది. ఈ వీడియోను షేర్ చేసిన కేటీఆర్ అడ్డగోలు హామీలు ఇచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ హామీలు ఇచ్చే సమయంలో ఆర్థిక పరిస్థితి గురించి ఆలోచించాలి కదా? అంటూ రాసుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణ భవిష్యత్ ఇలానే ఉండబోతుందా? అంటూ కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు.

    దీనికి స్పందించిన సిద్ద రామయ్య మిస్టర్ కేటీఆర్ మీకు ఫేక్ ఏంటో.. నిజం ఏంటో.. తెలియదు. అది ఫేక్ వీడియో బీజేపీ క్రియేట్ చేసిన వీడియో అందుకే మీ పార్టీని బీజేపీ బీ పార్టీ అన్నాం. ఆ వీడియోను బీజేపీ ఎడిట్ చేసింది. వాటినే ఇప్పుడు మీరు వాడుతున్నారు. అంటూ సిద్ద రామయ్య కౌంటర్ ట్వీట్ చేశారు. ఇద్దరు చేసిన ట్వీట్లపై నెటిజన్లు కూడా వారి వారి అభిప్రాయాలకు తగ్గట్లు కామెంట్లు చేస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    KCR Situation : చివరకు కేసీఆర్ పరిస్థితే జగన్ కు?

    KCR Situation :  రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. తెలంగాణలో...

    Polling in AP : ఏపీలో పెరిగిన పోలింగ్ ఎవరికి లాభం

    Polling in AP : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా అసెంబ్లీ,...

    Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వేళలు పొడిగింపు

    Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు శుభవార్త చెప్పింది....

    Actor Chandrakanth : ‘త్రినయని’ సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

    Actor Chandrakanth Died : త్రినయని, కార్తీక దీపం-2 సీరియల్స్ ఫేం...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    BRS : వద్దన్నా వినలేదు..అందుకే రావట్లేదు

    BRS : వరంగల్, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం వాస్తవానికి ...

    Sr. NTR : ఎన్టీఆర్ చరితం చిరస్మరణీయం..

    Sr. NTR : ఎన్టీఆర్ తెలుగు ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తంగా చాటిన మహనీయుడు....

    RTC MD Sajjanar : ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పై ఈసీకి ఫిర్యాదు

    RTC MD Sajjanar : టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పై...