37.7 C
India
Saturday, May 18, 2024
More

    H-1B Visa : H-1B వీసాల పునరుద్ధరణకు మార్గం సుగమం

    Date:

    H-1B Visa
    H-1B Visa

    H-1B Visa : అమెరికాలో పని చేసే వృత్తి నిపుణుల కోసం జారీ చేసే H-1B వీసాలను ఆ దేశంలోనే పునరుద్ధరించనున్నారు. దీనికి వైట్ హౌజ్ కు చెందిన నియంత్రణ సంస్థ ఓఐఆర్ఏ ఈ నెల 15వ తేదీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. H-1B వీసా సాధారణంగా మూడేళ్లకు ముగుస్తుంది. దీని తర్వాత మరో మూడేళ్లు పొడిగించుకునేందుకు వీసాదారులు వారి స్వదేశానికి వెళ్లడమో మరో ఇతర దేశం వెళ్లడమో చేసి అక్కడ పునరుద్ధరించుకోవాలి.

    ఈ ఏడాది (2023) జూన్ లో ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో H-1B వీసా అమెరికాలోనే పునరుద్ధరిస్తామని బైడెన్ ప్రభుత్వం భారత ప్రధానికి హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో మొదటగా పైలట్ ప్రాజెక్ట్ కింద 20 వేల వీసాలు పునరుద్ధరించేందుకు సన్నాహాలు చేపట్టారు. H-1B వీసాలను కలిగి ఉన్న వారిలో భారత్ కు చెందిన వారే ఎక్కువగా ఉంటారు. ఈ నేపథ్యంలో వారు నెలల పాటు నిరీక్షించాల్సి వస్తుంది. దీంతో ఇబ్బందులు తలెత్తున్నాయి.

    ఈ విషయంలో అమెరికా విదేశాంగ శాఖ డిప్యూటీ మినిస్టర్ స్టఫ్ట్ భారతీయులకు స్థానికంగానే H-1B వీసాలను పునరుద్ధరించాలని నిర్ణయించినట్లు నవంబరులో ప్రకటించారు. మొదటి విడుతలో అమెరికాలో ఉన్న 20 వేల మంది H-1B వీసా దారులు 20 వేల మంది వీసాలను డిసెంబర్ నుంచి మూడు నెలల్లో యూఎస్ లోనే పొండిగించబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ తో భారతీయులే ఎక్కువగా లబ్ధిపొందుతున్నారని అమెరికా వివరించింది.

    H-1B వీసా స్థానికంగానే పునరుద్ధరిస్తామని అమెరికా చెప్పడంతో భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక మూడేళ్లకు ఒకసారి ఇండియాకు వెళ్లాల్సి రావడం తప్పుతుందని అంటున్నారు. మోడీ ప్రభుత్వం చొరవకు వారు కృతజ్ఞతలు చెప్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Crime News : తీర్థయాత్రకు వెళ్లి వస్తుండగా బస్సు దగ్ధం..

    - 8 మంది మృతి.. 20 మందికి గాయాలు Crime News :...

    Two Lakh Loan : రెండు లక్షల రుణమాఫీ సాధ్యమయ్యేనా ??

    Two Lakh Loan : తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్...

    Rain Alerts : తెలంగాణలో నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు

    Rain Alerts : తెలంగాణలో శని, ఆదివారాలు రెండు రోజులు ఓ...

    Crime News : ఆస్తి కోసం తల్లీ, ఇద్దరు కుమార్తెల హత్య

    Crime News : ఓ వైపు కన్న తల్లి, మరోవైపు తను...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    America : అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ వాసి మృతి

    America : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువకుడు మృతి...

    Rashmika Mandanna : ముంబయి అటల్ సేతు పై రష్మిక మందన్న ప్రశంసలు.. మోదీకి ఫ్లస్ 

    Rashmika Mandanna : ముంబయి అటల్ సేతు పై హిరోయిన్  రష్మిక...

    H-1B Visa : హెచ్-1బీ వీసాదారులకు ఊరట – ఉద్యోగం కోల్పోయినా మరికొంత కాలం ఉండవచ్చు

    H-1B Visa : అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులకు ఊరట...

    Walmart Layoffs : లేఆఫ్ ప్రకటించిన వాల్ మార్ట్.. వందలాది మంది ఉద్యోగులు రోడ్డుపైకి..

    Walmart Layoffs : అమెరికాలోని వాల్ మార్ట్ తమ ఉద్యోగులకు భారీ...