37.8 C
India
Saturday, May 18, 2024
More

    Chandrababu Naidu : మొదటికే మోసమైతే ఎలా బాబుగారూ!

    Date:

    Chandrababu Naidu
    Chandrababu Naidu

    Chandrababu Naidu : 70ఏండ్లకు పైబడినా.. రాజకీయ నిర్ణయాల్లో మాత్రం బాబు దూకుడుగానే ఉంటారు. తనకు తాను చాణక్యుడిగా అభివర్ణించుకుంటారు. అయితే అలాంటి బాబు.. జగన్ కోసం వెయిటింగ్ చేస్తున్నారు. ఆయన కోసం  ఈయన వెయిటింగ్ ఎందుకనే కదా .. మీ అనుమానం..? అటు నుంచి యాక్షన్ ఉంటేనే ఇటు నుంచి రియాక్షన్ ఉంటుంది కదా పాలిటిక్స్ లో. ఇది అలాంటిదే.. అందుకే జగన్ వైపు బాబు చూస్తున్నారని చెప్పింది..

    చంద్రబాబు ఇప్పట్లో తమ అభ్యర్థులను ప్రకటించరు అని తెలుస్తోంది. జగన్ అభ్యర్థుల లిస్ట్ మొత్తం బయటకు వచ్చాక ఆ పార్టీ నుంచి టికెట్ రాని నేతలను టీడీపీ లో చేర్చుకునే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఇప్పటికే గోదావరి జిల్లాల్లో ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు బాబుతో టచ్ లో ఉన్నారని అంటున్నారు. అలాగే నెల్లూరులో కూడా వైసీపీలో ముగ్గురికి సీట్లు రావని అంటున్నారు. ఇలా జిల్లాకో ముగ్గురేసి వంతున లిస్ట్ ఉంది. ఇప్పుడు వీళ్లపై చంద్రబాబు కన్నేసి ఉంచారని సమాచారం.

    అలాంటి ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకుని.. వారితో వైసీపీని, జగన్ పై మాట్లాడించడం.. తద్వారా తమకు అనుకూలంగా రాజకీయాన్ని మలుచుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారని తెలుస్తోంది.  ఈ నేతల సేవలను పార్టీలో వినియోగించుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి సముచిత స్థానం కల్పించాలని అనుకుంటున్నారు. అయితే ఈ డీల్ కు ఓకే అన్న వైసీపీ నేతలు సైకిల్ ఎక్కడానికి ప్రయత్నిస్తున్నారట.

    ఇక వైసీపీ మాత్రం దూకుడుగా వెళ్తోంది. ఇప్పటికే అభ్యర్థుల మార్పుపై సిగ్నల్ పంపిన ఆ పార్టీ.. రెండు నెలల ముందుగానే అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకెళ్లాలని భావిస్తోంది. దీంతో తమ అభ్యర్థుల గెలపు అవకాశాలు మెరుగుపడుతాయని అంచనా వేస్తోంది. అయితే ఏడాది కిందటే అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పిన టీడీపీ..  ఆరు నెలలు.. మూడు నెలలు.. చివరకు నోటిఫికేషన్ వచ్చేదాక ఆగే పరిస్థితి కనపడుతోంది.

    ఒకవైపు జనసేనతో పొత్తుల పంచాయితీ తెగలేదు. మరొకవైపు కాంగ్రెస్, కామ్రేడ్ లతో పొత్తు అని , మరో వైపు బీజేపీతో పొత్తు అని ఇలా.. ఎన్నెన్నో కథనాలు వస్తున్నాయి. మరి చంద్రబాబు తొందరగా అభ్యర్థులను ప్రకటించి ప్రచార రంగంలోకి దిగుతారా? లేకుంటే గతంలో లోగానే నోటిఫికేషన్ వచ్చిన తర్వాతే అభ్యర్థులను ప్రకటిస్తారా? అనేది అంతుచిక్కడం లేదు. ఒకవేళ ఇలా చేస్తే మొదటికే మోసం వస్తే ఎలా అని పసుపు దళం ఆందోళన చెందుతోంది.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    KCR Situation : చివరకు కేసీఆర్ పరిస్థితే జగన్ కు?

    KCR Situation :  రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. తెలంగాణలో...

    Pinnelli Brothers : పిన్నెల్లి బ్రదర్స్ ఆ రోజు ఇంటి వెనుక గోడ దూకి.. ఈసీ దర్యాప్తులో సంచలన నిజాలు..

    Pinnelli Brothers : పల్నాడు జిల్లా, మాచర్లలో పోలింగ్ ప్రక్రియకు తీవ్ర...

    Viral Video : వైసీపీ పాలనపై బాధగా ఉంది.. – సోషల్ మీడియాలో వీడియో వైరల్

    Viral Video : రకరకాల అబద్దాలతో గత ఐదు సంవత్సరాలుగా పాలన...

    Women Voters : ఓటెత్తిన మహిళలు.. కలిసొచ్చేది ఎవరికో..?

    Women Voters : ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ జాతరను తలపిస్తున్నది. పోలింగ్...