40.2 C
India
Sunday, May 19, 2024
More

    Bandla Ganesh : దేవుడు పవన్ కళ్యాణ్ నే అంత మాట అంటావా..? బండ్లగణేష్ కౌంటర్ వైరల్

    Date:

    Bandla Ganesh
    Bandla Ganesh

    Bandla Ganesh : ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ సంచలన కామెంట్లతో వార్తల్లో నిలుస్తుంటారు. యూట్యూబ్ లో ఈయన ఇంటర్వ్యూలను జనాలు భలే ఎంజాయ్ చేస్తుంటారు. కమెడియన్ నుంచి ప్రొడ్యూసర్ గా మారిన గణేష్.. రాజకీయాల్లోనూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ప్రస్తుతం చలామణిలో ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో వరుస ట్వీట్లు, కామెంట్లతో హల్ చల్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడినా.. ఆ పార్టీపై సెటైర్లు వేస్తూనే ఉన్నారు. బండ్ల గణేష్ మాటలను అందరూ కామెడీగానే తీసుకున్నా.. ఒక్కోసారి ఆయన మాటలు ఆయనకే తిరిగి కొడుతుంటాయి.

    బండ్ల గణేష్ సినిమాల్లోకి వచ్చిన కొత్తలో కమెడియన్ గా నటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ప్రొడ్యూసర్ గా మారారు. ఈయన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు వీరభక్తుడు. ఆయనతో కలిసి పలు సినమాల్లోనూ నటించారు. పవన్ తో గబ్బర్ సింగ్ తీసిన తర్వాత నిర్మాతగా నిలదొక్కుకున్నారు. పవన్ పై అభిమానాన్ని సినిమా వేడుకల్లోనూ, మీడియా ఇంటర్వ్యూ ల్లోనూ విపరీతంగా ప్రదర్శిస్తుంటారు. అయితే ఈమధ్య పవన్ పై ఆయన వైఖరి మారినట్టుగా కనిపిస్తోంది.

    ‘‘నా సినిమాల కోసం నేను ఎవరినైనా పొగడుతానని’’.. అందరు హీరోలు తనకు సమానమేనని అని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. పైగా ఏపీలో జగన్ పాలన బాగుందని.. తనకు తెలిసిన వ్యక్తికి వైద్యసాయం చేశారని, ఆపదలో ఉన్నప్పుడు కాపాడిన వ్యక్తి దేవుడితో సమానమని చెప్పి జగన్ సర్కార్ పై ప్రశంసల జల్లు కురిపించారు. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ విషయంలో సీఎం జగన్ పై విమర్శలు చేశారు.

    తాజాగా ఓ ఇంటర్వ్యూ లో జనసేనాని పవన్ కల్యాణ్ పై చేసిన కామెంట్స్ తెగ వైరల్ అవతున్నాయి. ఆ ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ కు ఊహించని ప్రశ్న ఎదురైంది. సోషల్ మీడియాలో మీ ప్రొఫైల్ ఫొటోలో బుక్ చదువుతూ కనిపించారంటే.. మీకు పుస్తకాలు చదవడమంటే బాగా ఇష్టమా? అని యాంకర్  ప్రశ్నించాడు. దీనికి బండ్ల గణేష్ సమాధానం చెపుతూ.. ప్రతీ రోజు నేను గంటకు పైగా పుస్తకాలు చదువుతాను.. అందులో ఉన్న మంచి పాయింట్లను అండర్ లైన్ చేసుకుంటాను.. ఈ అలవాటు చిన్నతనం నుంచే ఉందని చెప్పుకొచ్చాడు. నేను రోజుకు గంట మాత్రమే చదువుతానని.. అంతే కానీ లక్షల సంఖ్యలో పుస్తకాలు చదివాను అంటూ గొప్పలు చెప్పుకోనని తెలిపాడు.

    పవన్ కల్యాణ్ ఓ సందర్భంలో మాట్లాడుతూ.. తాను లక్షల పుస్తకాలు చదివానని చెప్పారు..ఇప్పుడు దానికి కౌంటర్ గానే బండ్ల గణేష్ ఈ కామెంట్స్ చేశారని తెలుస్తోంది.  బండ్ల తన వ్యాఖ్యలను పవన్ ను ఉద్దేశించే చేశారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరి ఈ వివాదంపై బండ్ల గణేష్ ఎలా స్పందిస్తారో చూడాలి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బాడీగార్డు ఇంటిపై దాడి

    Pawan Kalyan : హైదరాబాద్ మీర్ పేటలోని లెనిన్ నగర్ లో...

    Jagan : జగన్ సైలెంట్ మోడ్ లోకి ఎందుకు వెళ్లినట్లు..?

    Jagan Silence : ఆంధ్రప్రదేశ్ లో నిన్న (మే 13) పోలింగ్...

    Viral Video : వైసీపీ పాలనపై బాధగా ఉంది.. – సోషల్ మీడియాలో వీడియో వైరల్

    Viral Video : రకరకాల అబద్దాలతో గత ఐదు సంవత్సరాలుగా పాలన...

    Viral video : ఓటర్ ను కొట్టిన ఎమ్మెల్యే..తిరిగికొట్టిన ఓటర్..వైరల్ వీడియో

    Viral video : ఏపీలో పోలింగ్ కొనసాగుతోంది. పలువురు ప్రముఖులు తమ...