31.6 C
India
Sunday, May 19, 2024
More

    YCP Campaign : ముదిరిన వైసీపీ ప్రచార పిచ్చి 

    Date:

    YCP campaign
    YCP campaign madness

    YCP Campaign : వైసిపి నేతల ప్రచార పిచ్చి పరాకాష్టకు చేరింది. వచ్చే ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి రావాలనే తపనతో విచిత్ర ప్రచారాలకు పూనుకుంటోంది.  తాజాగా తోపుడు బండ్ల పై వైసీపీ జెండా కలర్ ల తో పాటు జగన్మోహన్ రెడ్డి చిత్రాన్ని కూడా ఏర్పా టు చేయడంతో పలు విమర్శలు వ్యక్తమవుతు న్నాయి. ప్రభుత్వం చేసే కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి అనేక మార్గాలు ఉన్నాయి.

    అయితే ఆంధ్రప్రదేశ్ లోని వైసిపి ప్రభుత్వం మాత్రం వింత  ప్రచారం చేసుకుంటూ విమర్శలకు ఎదుర్కొంటుంది. ఎక్కడ ప్రచారం చేసుకోవాలి ఎక్కడ చేసుకోకూడదు అన్న మినిమం అవగా హన లేకుండా వ్యవహరిస్తుండడంతో ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తోపుడు బండ్లకే కాదండోయ్.. ప్రభుత్వ కార్యాలయంలో కూడా వైసిపి జెండా కలర్లు వేయడంతో గతంలో చాలా విమర్శలు వచ్చాయి.  ఇలా  ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు వేయడం పై ప్రతిపక్ష పార్టీ నేతలు కోర్టును కూడా ఆశ్రయించారు. కోర్టు మొట్టికాయలు వేయడంతో ప్రభుత్వం ఆ కలర్లను మార్చే ప్రయత్నం చేసింది.
     సాధారణంగా ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ జెండాను ప్రభుత్వ కార్యాలయాలకు వేయకూడదు. అయితే ఏపీలో మాత్రం అలా కాదు ప్రచారం అనే పిచ్చిలో ఎక్కడపడితే అక్కడ వైసిపి జెండాలు వేయడం సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోటోలు వేయడం పరిపా టిగా మారింది. ఇప్పుడు తోపు డుబండ్లకు అదే విధంగా సర్వే నెంబర్ రాళ్ల కూడా వైసిపి జెండా కలర్లను వేస్తున్నారు.  సర్వే నెంబర్ రాళ్ళకు వైసీపీ జెండా కలర్ ఎందుకు వేస్తు న్నారని పలువురు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తు న్నారు. మొత్తం మీద వైసిపి ప్రచార పిచ్చి ఇకమీ దట ఏ స్థాయికి వెళ్తుందోనని అందరూ తలలు పట్టుకుంటున్నారు.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    KCR Situation : చివరకు కేసీఆర్ పరిస్థితే జగన్ కు?

    KCR Situation :  రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. తెలంగాణలో...

    Pinnelli Brothers : పిన్నెల్లి బ్రదర్స్ ఆ రోజు ఇంటి వెనుక గోడ దూకి.. ఈసీ దర్యాప్తులో సంచలన నిజాలు..

    Pinnelli Brothers : పల్నాడు జిల్లా, మాచర్లలో పోలింగ్ ప్రక్రియకు తీవ్ర...

    Viral Video : వైసీపీ పాలనపై బాధగా ఉంది.. – సోషల్ మీడియాలో వీడియో వైరల్

    Viral Video : రకరకాల అబద్దాలతో గత ఐదు సంవత్సరాలుగా పాలన...

    Women Voters : ఓటెత్తిన మహిళలు.. కలిసొచ్చేది ఎవరికో..?

    Women Voters : ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ జాతరను తలపిస్తున్నది. పోలింగ్...