39.1 C
India
Monday, May 20, 2024
More

    Team India : టీమిండియా నిర్ణయంతో విమర్శల వెల్లువ

    Date:

    Criticism poured in with Team India's decision
    Criticism poured in with Team India’s decision

    Team India : టీమిండియా, ఇంగ్లండ్ జట్లు ఏడు టెస్టుల సిరీస్ ను ఆడుతున్నాయి. ఇందులో భాగంగా ఇదివరకు హైదరాబాద్ లో మొదటి టెస్ట్, విశాఖపట్నంలో రెండో టెస్ట్ ఆడాయి. మొదటి టెస్ట్ లో ఇంగ్లండ్, రెండో టెస్ట్ లో భారత్ విజయం సాధించాయి. దీంతో ఏడు టెస్ట్ ల సిరీస్ లో 1-1 తో సమంగా నిలిచాయి. దీంతో మిగతా ఐదు టెస్ట్ లపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

    ఈనేపథ్యంలో టీమిండియా మేనేజ్ మెంట్ ఓ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటుందని ప్రేక్షకులు మండి పడుతున్నారు. మూడో టెస్ట్ కు బుమ్రాకు సెలవు ఇవ్వాలని నిర్ణయించుకుంది. మూడో టెస్ట్ ఫిబ్రవరి 15న రాజ్ కోట్ లో జరుగుతుంది. దానికి ఇంకా పది రోజుల సమయం ఉంది. బుమ్రాకు పది రోజుల విశ్రాంతి సరిపోదా? అసలే ఇండియా పీకల్లోతు కష్టాల్లో ఉంది.

    ఇంగ్లండ్ బౌలర్లను ఎదుర్కోవాలంటే బుమ్రా ఒక్కడి వల్లే అవుతుంది. రెండో టెస్ట్ లో ఆరు వికెట్లు తీసి వారి పతనాన్ని శాసించాడు. మిగతా టెస్ట్ ల్లో కూడా తన సత్తా చాటి భారత్ ను గెలిపిస్తాడు. కానీ అతడికి విశ్రాంతి ఇవ్వాలనే బీసీసీఐ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సెలెక్టర్లకు తలకాయ లేదని చెబుతున్నారు. బుమ్రాకు విశ్రాంతి ఇస్తే టీమిండియాకు విజయం అంత సులభం కాదనే వాదనలు వస్తున్నాయి.

    బుమ్రా స్థానంలో మూడో టెస్ట్ కు మహ్మద్ సిరాజ్ కు అవకాశం ఇస్తారని అంటున్నారు. మూడో టెస్ట్ లో సిరాజ్ బౌలింగ్ ఎటాక్ లీడ్ చేయనున్నాడు. మూడో టెస్ట్ కు జట్టును మంగళవారం సెలెక్ట్ చేయనున్నారని తెలుస్తోంది. టీమిండియా బౌలర్లలో బుమ్రా తప్ప మిగతా వారెవరు రాణించడం లేదు. గెలుపు గుర్రం అయిన బుమ్రాను పక్కన పెడితే టీమిండియాకు నష్టమే. టీమిండియా రెండు టెస్ట్ లు గెలిచి ఉంటే ఇప్పుడు విశ్రాంతి ఇచ్చినా ఫర్వాలేదు. కానీ ఒకటే గెలిచింది. మరొకటి ఓడింది. దీంతో బుమ్రా అందుబాటులో ఉండాల్సిందేనని ప్రేక్షకులు కోరుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Balcony Baby Mother Suicide : ‘బాల్కనీ పసికందు’ తల్లి సూసైడ్.. సోషల్ మీడియా కాంమెట్లే కారణమా?

    Balcony Baby Mother Suicide : ఏప్రిల్ 28వ తేదీ తిరుముల్లైవాయల్‌లోని...

    Banglore Rave Party : బెంగళూరు లో రేవ్ పార్టీ తెలుగు మోడల్స్, నటీనటులు అరెస్టు?

    Banglore Rave Party : బెంగళూరులో రేవ్ పార్టీ లో తెలుగు...

    AP Leaders : నాయకులకు నిద్రలేని రాత్రులు ..

    AP Leaders : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్  ఎన్నికలు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    T20 World Cup : టీ20 వరల్డ్ కప్ లో ఇండియా పూర్తి షెడ్యూల్ ఇదే

    T20 World Cup : జూన్ 2 వ తేదీ నుంచి...

    Team India : టీం ఇండియా కు హెడ్ కోచ్ కు ఇతడే సరైనోడా?

    Team India Coach : ఇండియా క్రికెట్ టీంకు నూతన కోచ్ కోసం...

    T20 World Cup Promo : ట్రెండింగ్ లో టీ20 వరల్డ్ కప్ ప్రోమో..

    T20 World Cup Promo : ప్రస్తుతం ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్...