36.2 C
India
Thursday, May 16, 2024
More

    Ashish Nehra : నెహ్రాకు కరెక్ట్ సూటైన ‘హడావుడి అంకుల్’.. ఫుల్ హ్యామరస్ గా ఇన్ స్టా వీడియో..

    Date:

    Ashish Nehra
    Ashish Nehra

    Ashish Nehra : ఏం క్రియేటివిటీరా నాయనా? ఇగ చేతిలో సెల్ ఫోన్, సరిపడిన బ్యాలన్స్, సోషల్ మీడియా యాప్స్ ఉంటే చాలు క్రియేటివిటీకి ఢోకాలేనట్లు కనిపిస్తుంది. అసలు వీరికి ఆ ఆలోచనలు ఎక్కడి నుంచి పుట్టుకస్తాయో కూడా తెల్వదు. అందుకే అన్నారేమో ‘బుర్రకో బుద్ధి’ అని. సరే ఇవన్నీ పక్కన పెడితే కింద ఉన్న లింక్ ను ఒక్క సారి చూడండి. క్రియేటివిటీ అంటే ఏంటో అర్థం అవుతుంది. ఈ వీడియోను గనుక అందులో ఉన్న ఆశిష్ నెహ్రా చూస్తే దెబ్బకు కండ్లు తేలేస్తాడు కావచ్చు. లేదంటే నవ్వీ, నవ్వీ, నవ్వీ చస్తాడు కావచ్చ. వారిని పిలిచి మరీ సత్కరిస్తాడు కావచ్చు కదా..?

    View this post on Instagram

    A post shared by CheetKaaZ (@cheet_kaaz)

    ప్రస్తుతం ఇండియాతో పాటు ప్రపంచం కూడా ఐపీఎల్ స్మరణ చేస్తున్నాయి. ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శనతో రక్తి కట్టిస్తున్నారు. ప్రేక్షకులకు అసలు సిసలైన టీ20 మజా ఇస్తున్నారు. ఇదే స్థాయిలో వారు తమ ఆట తీరు ప్రదర్శిస్తే.. 45 రోజులేం కర్మ.. ఏడాది మొత్తం ఐపీఎల్ కొనసాగినా చూస్తూనే ఉంటారు. ఐపీఎల్ లో ఎన్నో వ్యవహారాలు కొనసాగుతుంటాయి. ఇందులో ముఖ్యంగా ఆయా జట్ల ఆటగాల్లు, వారితో పాటు కోచ్ లు చేసే హడావిడి అంతా ఇంతా కాదు. అలాంటి హడావిడికి పర్యాయపదం ఆశిష్ నెహ్రా.

    దశాబ్దం క్రితం వరకు టీమిండియాలో కీలక బౌలర్ ఆశిష్ నెహ్రా. ఆ సమయంలో భారత్ విజయ దుంధుబి మోగించింది. అందులో కీలకమైన వ్యక్తి ఆశీష్ నెహ్రా. పస్తుతం ఆయన ‘గుజరాత్ టైటన్స్’కు కోచ్ గా ఉన్నాడు. 2022లో కప్ సాధించడంలో ఆశీష్ కీలక పత్ర పోషించాడు. గత సీజన్ లోనూ సెకండ్ ప్లేస్ లో నిలిపాడు.

    ప్రస్తుతం గుజరాత్ టైటన్స్ ప్రయాణం పడుతూ, లేస్తూ సాగుతోంది. గెలుపునకు వ్యూహాలు పన్నడంలో నెహ్రా చాకచక్యంగా వ్యవహరిస్తున్నాడు. మ్యాచ్ జరిగే సమయంలో స్టేడియం అంతా తానై కనిపిస్తున్నాడు. ఆటగాళ్లకు సలహాలు ఇస్తున్నాడు. ఈ దృశ్యాలతో ఓ నెటిజన్ అద్భుతమైన వీడియో రూపొందించాడు. ఇందులో నెహ్ర హావ భావాలకు తగ్గట్టుగా రీమిక్స్ చేశాడు. అది పూర్తిగా తెలంగాణ స్లాంగ్ లో ఉండడంతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

    ఇప్పటికే ఈ వీడియో 1.4 మిలియన్ వ్యూవ్స్ దక్కించుకుంది. 135కేకు పైగా లైక్స్ సొంతం చేసుకుంది. ఈ వీడియోను చూసిన చాలా మంది మెచ్చుకుంటున్నారు. ఏం తాగి ఎడిట్ చేశావంటూ కామెంట్లు పెడుతున్నారు. ‘జీరో బల్బ్ తీసుకురా’ అనే మాటకు నెహ్రా పలికించిన హావ భావాలు పీక్స్.

    Share post:

    More like this
    Related

    Gujarat News : ఈతకు వెళ్లి ఒకే కుటుంబంలో ఏడుగురి మృతి

    Gujarat News : గుజరాత్ లోని నర్మదా నదిలో ఈత కొట్టేందుకు...

    Anchor Anasuya : అనసూయ బర్త్ డే సందర్భంగా సుశాంక్ ఏం పోస్ట్ చేశాడంటే?

    Anchor Anasuya : నటిగా మారిన యాంకర్ అనసూయ భరద్వాజ్ సౌత్...

    Ex-Indian Army Officer : మాజీ సైన్యాధికారి మృతిపై ఐరాస సంతాపం – భారత్ కు క్షమాపణలు

    Ex-Indian Army Officer : భారత మాజీ సైన్యాధికారి కర్నల్ వైభవ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related