34.7 C
India
Friday, May 17, 2024
More

    SRS VS RCB : సన్ రైజర్స్, ఆర్సీబీ మ్యాచ్ లో గెలుపెవరిదో..?

    Date:

    SRS VS RCB
    SRS VS RCB

    SRS VS RCB : సన్ రైజర్స్ హైదరాబాద్, ఆర్సీబీ మధ్య బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో సోమవారం సాయంత్రం ఐపీఎల్ 30 వమ్యాచ్ జరగనుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో చెలరేగిపోతున్న సన్ రైజర్స్ ఈ మ్యాచ్ లో ఫేవరేట్ గా బరిలోకి దిగుతుండగా.. ఆరు మ్యాచ్‌ ల్లో ఒకటి మాత్రమే గెలిచి తప్పక విజయం సాధించాల్సిన మ్యాచ్ లో ఆర్సీబీ చావో రేవో తేల్చుకోనుంది.

    ఇప్పటి వరకు ఆరు మ్యాచ్ లు ఆడిన ఆర్సీబీకి .. బౌలర్ల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఆరు మ్యాచ్ ల్లో కేవలం 26 వికెట్లే తీశారంటే అతిశయోక్తి కాదు. విరాట్ కొహ్లి పైనే ఆర్సీబీ బ్యాటింగ్ భారం పడుతోంది. మిగతా బ్యాటర్లు ఎవరూ రాణించలేకపోతున్నారు. ఫాప్ డుప్లెసిస్ అయితే ముంబయి ఇండియన్స్ తో ఓటమి తర్వాత 250 పరుగుల చేస్తేనే గెలుస్తామెమో అని వాపోవడం చూస్తుంటే బాధ కలగక మానదు.

    సన్ రైజర్స్ తో ఇప్పటి వరకు తలపడిన ఆర్సీబీ కి మంచి రికార్డే ఉంది. మొత్తం మీద 10 సార్లు ఆర్సీబీ గెలవగా.. 12 సార్లు సన్ రైజర్స్ విజయాలు సాధించింది. ఇంతవరకు చిన్నస్వామి స్టేడియంలో రెండు సార్లు మాత్రమే సన్ రైజర్స్ గెలవగా అందులో 2016 ఐపీఎల్ ఫైనల్ కావడం విశేషం. ఆ తర్వాత జరిగిన ఒక్క మ్యాచ్ లోనే చిన్నస్వామి స్టేడియంలో  గెలిచిన సన్ రైజర్స్ కు ఈ మ్యాచ్ పరీక్ష లాంటిదే.

    సన్ రైజర్స్ బ్యాటర్లు క్లాసెన్, హెడ్, అభిషేక్ శర్మ, ఫుల్ ఫామ్ లో ఉండడం, కొత్త కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి గత మ్యాచ్ లో బ్యాటింగ్ లో అదరగొట్టడం, బౌలింగ్ లో నటరాజన్, కమిన్స్, భువనేశ్వర్ కుమార్ ఫామ్ లో ఉండటం కలిసొచ్చే అంశాలు. భువీకి ఇక్కడ మంచి రికార్డే ఉంది. ఎనిమిది మ్యాచ్ ల్లో తొమ్మిది వికెట్లతో తక్కువ ఏకానమీతో  మంచి ప్రదర్శనే కనబర్చాడు. ఆర్సీబీ బౌలర్లు సిరాజ్, టాప్లీ, తేలిపోతుండగా.. బ్యాటింగ్ లో మ్యాక్స్ వెల్, గ్రీన్ బ్యాటింగ్ లో దారుణంగా విఫలమవుతున్నారు.  ఆర్సీబీకి  ఉన్న ఏకైక సానుకూలంశం సొంత స్టేడియంలో మ్యాచ్ ఆడనుండటం.. విరాట్ పైనే భారం వేసిన ఆర్సీబీ  స్థాయికి తగ్గ ప్రదర్శన చేస్తుందో లేదో చూడాలి.

    Share post:

    More like this
    Related

    Prabhas : కాబోయే భార్యను పరిచయం చేయబోతున్న ప్రభాస్.. ఇన్ స్టా పోస్టు వైరల్ 

    Prabhas : డార్లింగ్స్ ఫైనల్లీ సమ్ వన్ వెరీ స్పెషల్ పర్సన్...

    RCB : బెంగళూరు ప్లే ఆఫ్స్ చేరాలంటే.. 

    RCB : ఐపీఎల్ సీజన్ చివరకు దశకు చేరుకుంది. ప్లే ఆఫ్స్...

    Rashmika Mandanna : ముంబయి అటల్ సేతు పై రష్మిక మందన్న ప్రశంసలు.. మోదీకి ఫ్లస్ 

    Rashmika Mandanna : ముంబయి అటల్ సేతు పై హిరోయిన్  రష్మిక...

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బాడీగార్డు ఇంటిపై దాడి

    Pawan Kalyan : హైదరాబాద్ మీర్ పేటలోని లెనిన్ నగర్ లో...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    RCB : బెంగళూరు ప్లే ఆఫ్స్ చేరాలంటే.. 

    RCB : ఐపీఎల్ సీజన్ చివరకు దశకు చేరుకుంది. ప్లే ఆఫ్స్...

    Sunrisers Hyderabad : ప్లే ఆఫ్స్ కు సన్ రైజర్స్..  మిగిలిన ఒక్క స్థానం ఎవరికో

    Sunrisers Hyderabad : ఉప్పల్ లో గురువారం జరగాల్సిన గుజరాత్ టైటాన్స్,...

    Sunrisers Hyderabad : సన్ రైజర్స్ గెలిస్తే ప్లే ఆప్స్ కు.. ఇక టైటిట్ వేట

    Sunrisers Hyderabad : సన్ రైజర్స్ హైదరాబాద్ గుజరాత్ తో టైటాన్స్...

    Bengali Girl Viral : ఐపీఎల్ కు హీట్ పెంచుతున్న బెంగాలీ.. అసలు ఎవరీమే?

    Bengali Girl Viral :  ఐపీఎల్ టోర్నమెంట్ ప్రారంభమైదంటే చాలు క్రికెట్...