28.2 C
India
Saturday, May 18, 2024
More

    CSK vs LSG : లక్నో సూపర్ గెయింట్స్..చెన్నై సూపర్ కింగ్స్ కు కీలక పోరు

    Date:

    CSK vs LSG
    CSK vs LSG

    CSK vs LSG : చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ గెయింట్స్ మధ్య మంగళవారం చెపాక్ లో కీలక పోరు జరగనుంది. ఇప్పటికే చెన్నై, లక్నో నాలుగు మ్యాచుల్లో విజయం సాధించగా.. 8 పాయింట్లతో సమానంగా ఉన్నాయి. కానీ నెట్ రన్ రేట్ తక్కువగా ఉండడంతో అయిదో స్థానంలో లక్నో కొనసాగుతుండగా.. నాలుగో స్థానంలో చెన్నై ఉంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారనుంది.

    చెన్నై చెపాక్ స్టేడియంలో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచుల్లో విజయం సాధించింది. అయితే బయట ఆడిన మ్యాచ్ లు ఓడిపోవడం చెన్నై కు చేటు చేసింది. చెన్నై లో రచిన్ రవీంద్ర ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నాడు. అజింక్య రహనే మునుపటి ఫామ్ అందుకోలేకపోతున్నాడు. దోని చివర్లో మెరుపులు మెరిస్తున్నా.. మిడిలార్డర్ బ్యాట్స్ మెన్ విఫలం కావడం ఆందోళన కలిగిస్తుంది.

    లక్నో సూపర్ గెయింట్స్ లో కేఎల్ రాహుల్ గత మ్యాచ్ లో ఫామ్ లోకి వచ్చాడు. పూరన్ కూడా విధ్వంసం సృష్టిస్తున్నాడు. స్టాయినిస్ ఇప్పటి వరకు ఆడిన మ్యాచుల్లో అయిదు సార్లు స్పిన్ బౌలింగ్ లో అవుటయ్యాడు. దీంతో స్టోనియిస్ వికెట్ తీసేందుకు స్పిన్నర్లను రంగంలోకి దించేందుకు చెన్నై ప్రణాళికలు రచిస్తోంది.

    లక్నో బౌలర్లలో మయంక్ యాదవ్ ఇంకా గాయం నుంచి కోలుకోలేదు. గంటకు 150 కిలోమీటర్ల మేర వేగంతో బౌలింగ్ చేస్తున్న మయంక్ గాయపడడం లక్నో కు ఇబ్బందికరమైన అంశమే అయినా యశ్ ఠాకూర్ రాణిస్తుండడంతో ఆ లోటు కనిపించడం లేదు. ఈ మ్యాచ్ లో ఎవరూ గెలిచిన పాయింట్ల పట్టికలో ముందుంజలోకి వెళతారు. రాబోయే కీలక మ్యాచ్ లకు పాజిటివ్ ఎనర్జీతో రంగంలోకి దిగవచ్చు.  లక్నో బ్యాటింగ్ లో ఆయుష్ బదోని, దీపక్ హుడా లాంటి బ్యాటర్లు ఇంకా సత్తా చాటాల్సిన అవసరముంది. చెన్నై సమతూకంగా కనిపిస్తున్న జడేాజా, దీపక్ చాహర్ ఇద్దరు ఫామ్ లోకి వస్తే చెన్నైకి ఈజీగా విక్టరీలు సాధించే అవకాశం ఉంటుంది.

    Share post:

    More like this
    Related

    MI Vs LSG : చివరి మ్యాచ్ లో ముంబయి ఢీలా.. లక్నో గెలుపుతో ఇంటి బాట

    MI Vs LSG : ముంబయి ఇండియన్స్ తో వాంఖడే లో...

    Jagtial District : జగిత్యాల జిల్లాలో విషాదం.. అన్నదమ్ములను బలిగొన్న భూ వివాదం

    Jagtial District : భూ వివాదంలో జరిగిన గొడవ ఇద్దరు అన్నదమ్ములను...

    SIT Investigation : ఏపీలో హింసపై సిట్ దర్యాప్తు

    SIT Investigation : ఏపీలో ఎన్నికల ముందు, తర్వాత జరిగిన హింసపై...

    America : అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ వాసి మృతి

    America : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువకుడు మృతి...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    MI Vs LSG : చివరి మ్యాచ్ లో ముంబయి ఢీలా.. లక్నో గెలుపుతో ఇంటి బాట

    MI Vs LSG : ముంబయి ఇండియన్స్ తో వాంఖడే లో...

    RCB : బెంగళూరు ప్లే ఆఫ్స్ చేరాలంటే.. 

    RCB : ఐపీఎల్ సీజన్ చివరకు దశకు చేరుకుంది. ప్లే ఆఫ్స్...

    Sunrisers Hyderabad : ప్లే ఆఫ్స్ కు సన్ రైజర్స్..  మిగిలిన ఒక్క స్థానం ఎవరికో

    Sunrisers Hyderabad : ఉప్పల్ లో గురువారం జరగాల్సిన గుజరాత్ టైటాన్స్,...

    Sunrisers Hyderabad : సన్ రైజర్స్ గెలిస్తే ప్లే ఆప్స్ కు.. ఇక టైటిట్ వేట

    Sunrisers Hyderabad : సన్ రైజర్స్ హైదరాబాద్ గుజరాత్ తో టైటాన్స్...