34.1 C
India
Saturday, May 18, 2024
More

    Troubleshooter : ట్రబుల్ షూటర్.. ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

    Date:

    Troubleshooter
    Troubleshooter Harish Rao

    Troubleshooter Harish Rao : 14.. లోక్ సభ స్థానలను దక్కించుకోవడమే సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. దీనికి తగ్గట్టుగానే ఆయన ప్రచారం చేస్తున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యత కూడా తనదే అంటూ రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేపడుతున్నారు. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో బహిరంగ సభల్లో పాల్గొన్న రేవంత్ రెడ్డి తనదైన పంచ్ డైలాగ్ తో హీట్ పుట్టిస్తున్నారు. ప్రత్యర్ధి పార్టీలకు హెచ్చరికలు, సవాళ్లు విసురుతూ ఎన్నికల జోష్ నింపుతున్నారు.

    రూ. 2 లక్షల రైతు రుణమాఫీ డిసెంబర్ 9వ తేదీనే అమలు చేస్తామని హామీ ఇచ్చి ఇంకా చేయకపోవడంతో ఇదే తమకు ఓట్లు తెచ్చి పెడుతుందని బీఆర్ఎస్ , బీజేపీ భావించాయి. వీటిని ముందుకు తెచ్చి లోక్ సభ ఎన్నికల రాజకీయం చేయాలనుకున్నారు కానీ, ప్రతిపక్షాలకు రేవంత్ ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ఆగస్ట్ 15లోగా రూ. 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని భద్రాద్రి రామయ్య సాక్షిగా హామీ ఇచ్చారు. తమకు రేవంత్ మాటలపై నమ్మకం లేదన్న మాజీ మంత్రి హరీష్ రావు.. ఆగస్ట్ 15లోగా రుణమాఫీ చేయకపోతే పదవికి రాజీనామా చేస్తావా..? అని రేవంత్ కు సవాల్ విసిరారు.

    పంద్రాగస్ట్ లోగా రుణమాఫీ చేస్తానని రేవంత్ స్పష్టం చేశారు. డెడ్ లైన్ లోగా రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ ను మూసేస్తావా? అని హరీష్ రావుకు ప్రతి సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి. దీనిపై హారీష్ ఇప్పటి వరకు స్పందించలేదు. కానీ, రేవంత్ ప్రతి సవాల్ బీఆర్ఎస్ ను డిఫెన్స్ లోకి నెట్టేసింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ మేనిఫెస్టో కాదు.. రేవంత్ డైలాగులే కాంగ్రెస్ అభ్యర్థులను విజయతీరాలకు చేరుస్తాయనే తాజా విశ్లేషణలు వ్యక్తం అవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతుబంధుపై అతిగా ప్రచారం చేసి నష్టపోయిన బీఆర్ఎస్ లోక్ సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ ను ఎలాగైనా ఇరికించాలని రుణమాఫీ గురించి లేవనెత్తారు. కానీ అది భూమ్ రాంగ్ అయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

    గతేడాది అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసే సమయంలో రైతుబంధు వేసి రైతుల మెప్పు పొందాలనుకుంది బీఆర్ఎస్. రైతుబంధు విడుదలకు అనుమతి రావడంతో ఈ విషయంపై హరీశ్ రావు అత్యుత్సాహం ప్రదర్శించడంతో ఈసీ బ్రేకులేసింది. నిబంధనలకు విరుద్దంగా రైతుబంధుపై బీఆర్ఎస్ ప్రచారం చేసుకోవడంతో రైతుబంధు నిలిచిపోయిందని రేవంత్ ఎదురుదాడి చేశారు. ఏది ఏమైనా బీఆర్ఎస్ కు ఇది తీవ్ర నష్టం చేసిందని.. కేసీఆర్ కూడా హరీష్ రావుపై ఆగ్రహం వ్యక్తం చేశారని ప్రచారం జరిగింది.

    ఇప్పుడూ అదే తరహాలో లోక్ సభ ఎన్నికల ముందు రుణమాఫీపై సవాల్ విసిరి రేవంత్ రాజకీయానికి హరీష్ డిఫెన్స్ లో పడ్డారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ట్రబుల్ షూటర్ గా గుర్తింపు ఉన్న హరీష్ బీఆర్ఎస్ పార్టీకి ట్రబుల్ మేకర్ అవతారా? అనే చర్చ ఆ పార్టీలో మొదలైంది.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    BRS : వద్దన్నా వినలేదు..అందుకే రావట్లేదు

    BRS : వరంగల్, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం వాస్తవానికి ...

    Women Voters : ఓటెత్తిన మహిళలు.. కలిసొచ్చేది ఎవరికో..?

    Women Voters : ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ జాతరను తలపిస్తున్నది. పోలింగ్...

    Polling Percentage : 9 గంటల వరకు 10.35 శాతం పోలింగ్

    Polling Percentage : దేశవ్యాప్తంగా నాలుగో విడత లోక్ సభ ఎన్నికల్లో...

    KCR : కేంద్రంలో వచ్చేది ఆ ప్రభుత్వమే..: కేసీఆర్

    KCR : కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో బీఆర్ఎస్...