31.6 C
India
Sunday, May 19, 2024
More

    World Leadership : అమెరికా వైదొలిగితే.. ప్రపంచ నాయకత్వ బాధ్యతలు ఎవరివి?: బైడెన్‌

    Date:

    World Leadership

    World Leadership Comments Biden

    World Leadership : ఇండియాలో జరుగుతున్న ఎన్నికలకు అమెరికా ఎన్నికలకు చాలా వ్యత్యాసమే ఉన్నా.. సమయం మాత్ర ఒకే సారి కలిసి వస్తుంది. నవంబరులో అధ్యక్ష ఎన్నికల కోసం అమెరికా ప్రచారంలో దూసుకుపోతోంది. ఫ్లోరిడాలో మంగళవారం జరిగిన సభలో డెమోక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి బైడెన్‌ కీలక వ్యాఖ్య చేశారు. ప్రపంచ నాయకత్వ బాధ్యతలు అమెరికా తీసుకోవాల్సిన అవసరం లేదని తన ప్రత్యర్థి, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ అంటున్నారని అన్నారు. అదే జరిగితే ప్రపంచానికి నాయకత్వం ఎవరు వహిస్తారని తన  మద్దతుదారులను ఆయన ప్రశ్నించారు.

    జీ-7, జీ-20 వంటి అంతర్జాతీయ వేదికలపై ఆయా దేశాధినేతలు తన వద్దకు వచ్చిన ‘మళ్లీ మీరే గెలవాలి’ అని తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. మీరు గెలిస్తేనే ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్యం నిలబడుతుందని వారు పేర్కొన్నారని అన్నారు. యావత్‌ ప్రపంచం అమెరికావైపే చూస్తోందన్నారు. ఎవరు గెలుస్తారనే అంశం కంటే.. ఎన్నికలు ఎలా జరగనున్నాయనే దానిపై అందరూ దృష్టి సారించారని తెలిపారు.

    500 మి. డాలర్ల విరాళాలు..
    తన ప్రచారం బాగానే ముందుకెళ్తోందని బైడెన్ అన్నారు. ఇప్పటి వరకు 500 మిలియన్ల డాలర్లకు పైగా తనకు విరాళాలు అందాయని పేర్కొన్నారు. వీటిని 16 లక్షల మంది దాతలు అందించినట్లు తెలిపారు. 97 శాతం మంది 200 డాలర్ల కంటే తక్కువగానే ఇచ్చారని చెప్పారు.

    పోల్స్‌లో మనకే అనుకూలం..
    గెలుపులో ట్రంప్ కంటే తానే ముందున్నానని అనేక సర్వేలు చెప్తున్నాయని బైడెన్ అన్నారు.‘ఇప్పటి వరకు వెలువడిన 23 జాతీయ స్థాయి పోల్స్‌లో 10లో నేనే ముందున్నాను. ట్రంప్‌ 8లో ఆధిక్యంలో ఉండగా.. 5 టైగా తేలింది. పరిస్థితులు మనకే అనుకూలంగా ఉన్నాయి. మార్కెట్‌ పోల్‌లో 8 పాయింట్లు ఎగబాకాం. ఎకెలన్‌ పోల్‌లో 7 పాయింట్లు మెరుగయ్యాం. మార్టిస్ట్‌ పోల్‌లో 3 పాయింట్లు పెరిగాయి’ అని బైడెన్ తన మద్దతుదారులతో తెలిపారు.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    America : అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ వాసి మృతి

    America : అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువకుడు మృతి...

    H-1B Visa : హెచ్-1బీ వీసాదారులకు ఊరట – ఉద్యోగం కోల్పోయినా మరికొంత కాలం ఉండవచ్చు

    H-1B Visa : అమెరికాలో ఉద్యోగం కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులకు ఊరట...

    Walmart Layoffs : లేఆఫ్ ప్రకటించిన వాల్ మార్ట్.. వందలాది మంది ఉద్యోగులు రోడ్డుపైకి..

    Walmart Layoffs : అమెరికాలోని వాల్ మార్ట్ తమ ఉద్యోగులకు భారీ...

    USCIS : USCIS కొత్త పెండింగ్ I-485 ఇన్వెంటరీ..

    USCIS : యూఎస్ లో శాశ్వత నివాసం కోరుతూ దాఖలు చేసే...