Pawan Kalyan: వైసిపి అధినేత సీఎం జగన్ పై నాకు వ్యక్తిగ తంగా ఎలాంటి ద్వేషం లేదని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. నేను అధికారం కోసం కాదు మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చానని ఆయన తెలిపారు.
అన్యాయాన్ని ఎదిరించేందుకే వచ్చారని పవన్ తెలిపారు. కానీ ఓడిపోయినప్పుడు శూన్యం అనిపించిందనీ ఆయన అన్నారు. ప్రజల కష్టాలు నావే అనుకుని బ్రతుకుతున్నాను అని తెలిపారు.
వైసిపి వాళ్లు మమ్మల్ని తొక్కేస్తామంటే కుదరదు.. మేమే మిమ్మల్ని తొక్కేస్తామని పవన్ కళ్యాణ్ ఘాటుగా విమర్శించారు. రానున్న రోజుల్లో వైసీ పీకి తగిన గుణపాఠం చెబుతామని పవన్ కళ్యాణ్ తెలిపారు.