
Pushpa Raj Brother : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు రావడంతో మరింత దూకుడుగా ఉన్నారు. ఆయన చేస్తున్న ‘పుష్ప: ది రూల్’ ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే పుష్ప: ది రైజింగ్ తో దేశాన్నే ఒక కుదుపు కుదిపిన సుకుమార్ పై బన్నీ అభిమానులు పుష్ప2పై హ్యూజ్ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొన్నారు. పుష్ప1 రూ. 100 కోట్ల మూవీ క్లబ్ లో చేరింది. ఈ సారి పుష్ప2తో రూ. 1000 కోట్ల క్లబ్ లో చేరాలని సన్నాహాలు చేస్తున్నారు.
ఇక, బన్నీకి ఉత్తమ నటుడు అవార్డు రావడంతో పుష్ప2ను మరింత జాగ్రత్తగా తెరకెక్కించాలని ఇటు బన్నీ, అటు సుకుమార్ బాగా శ్రమిస్తున్నారు. గతంలో టీజర్, మోషన్ పోస్టర్ రిలీజ్ కావడంతో హ్యూజ్ వ్యూవ్స్ దక్కించుకుంది. ఈ మధ్యనే వచ్చే సంవత్సరం ఆగస్ట్ 15 (15 ఆగస్ట్, 2024)న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. రీసెంట్ గా సోషల్ మీడియాలో పుష్ప2కు సంబంధించి క్రేజీ అప్ డేట్ ఒకటి లీకైంది. ఈ మూవీలో తమిళ హీరో కార్తీక్ కూడా నటించబోతున్నట్లు లీకులు వినిపిస్తున్నాయి.
ఈ మూవీలో పుష్ప ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే పాత్ర కోసం కార్తీని ఎంచుకున్నారట దర్శకుడు సుకుమార్. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఈ పాత్ర టోటల్ సినిమాపై భారీగా ఇంపాక్ట్ తీసుకువస్తుందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కార్తీ లాంటి క్రేజ్ ఉన్న నటుడు ఈ ప్రాజెక్టులో భాగమైతే మరింత బాగుంటుందని సుకుమార్ ఈ ప్రయత్నం చేసినట్లు టాక్ వినిపిస్తుంది. ఏది ఏమైనా భారీ తారాగణంతో ఈ మూవీని మల్టీ స్టారర్ మూవీగా కూడా మారుస్తున్నారు సుకుమార్.