34 C
India
Tuesday, May 21, 2024
More

    Telugu Reading Competitions: డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలుగు పఠనా పోటీలు..

    Date:

    Telugu Reading Competitions:‘దేశ భాషలందు తెలుగు లెస్స’. ఇది ఒక్క ఇండియాలోనే కాకుండా యావత్ ప్రపంచంలో కూడా చాటి చెప్తున్నారు మన తెలుగు వారు. తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన వారి కుటుంబాల్లోని చిన్నారులు వారి మాతృ (తెలుగు) భాషను మరవద్దని వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే నాటా, తానా లాంటి పెద్ద పెద్ద ఆర్గనైజేషన్లతో తెలుగు సంస్కృతిని అక్కడే పుట్టిన తెలుగు ఫ్యామిలీకి చూపిస్తుంటే. మరింత అడుగు ముందుకేసి తెలుగు భాష గురించి కూడా కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

    ఇందులో భాగంగా డిట్రాయిట్ తెలుగు అసోసియేషన్ చిన్నారుల కోసం కొన్ని కార్యక్రమాలను నిర్వహిస్తుంది. చిన్నారుల్లోని పఠనా సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు ఈ పోటీలు చాలా దోహదపడతాయి. ‘శివరాం ప్రసాద్ యార్లగడ్డ’ ఈ పోటీలను నిర్వహిస్తుండగా, ‘ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్’ అధ్యక్షతన కొనసాగనున్నాయి. పోటీలు 17 సెప్టెంబర్, 2023వ తేదీ 2 గంటలకు ఎస్వీ టెంపుల్, టాఫ్ట్ రోడ్ 26233, నోవి, మిచిగావ్ 48374లో ఉంటాయని తెలిపారు.

    ఇందులో రెండు కేటగిరీలను ఏర్పాటు చేసి బహుమతులను కూడా నిర్ణయించారు. మొదటి కేటగిరిలో 5వ తరగతిలోపు పిల్లలు పాల్గొంటారు. వీరికి మొదటి బహుమతి 200 డాలర్లు, రెండో బహుమతి 100 డాలర్లు, మూడో బహుమతి 50 డాలర్లు ఉంటాయి. 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు రెండో కేటగిరీ ఇందులో కూడా వీరికి మొదటి బహుమతి 200 డాలర్లు, రెండో బహుమతి 100 డాలర్లు, మూడో బహుమతి 50 డాలర్లు బహుమతులు ఉంటాయి.

    మరిన్ని వివరాల కోసం అధ్యక్షుడు దుగ్గిరాల కిరణ్, డిట్రాయిట్ తెలుగు అసోసియేషన్ +1 (732)781-8102 లో సంప్రదించాలని నిర్వాహకులు సూచించారు.

    Share post:

    More like this
    Related

    Road Accident : ఛత్తీస్ గఢ్ లో రోడ్డు ప్రమాదం – వాహనం లోయలో పడి 18 మంది మృతి

    Road Accident : ఛత్తీస్ గఢ్ లో ఘోర రోడ్డు ప్రమాదం...

    Prashant Kishore : వైసీపీకి ఘోర పరాజయం: ప్రశాంత్ కిషోర్

    Prashant Kishore : ఏపీలో టీడీపీదే గెలుపని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త...

    AP Voilence : ఏపీలో హింసాత్మక ఘటనలపై.. డీజీపీకి సిట్ నివేదిక

    AP Voilence : ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత...

    Manchu Lakshmi : పొట్టి బట్టల్లో చెలరేగిపోతున్న మంచు లక్ష్మి

    Manchu Lakshmi : తెలుగులో మంచు లక్ష్మి అంటే తెలియని వారు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    New Zealand : న్యూజీలాండ్ లో మొట్టమొదటి తెలుగు అష్టావధానం

    New Zealand : తెలుగు భాష ప్రచారానికి కంకణం కట్టుకుంటున్నారు. తెలుగు...

    డాలస్ లో వైభవంగా మహిళా దినోత్సవ వేడుకలు

    విమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ ( women empowerment telugu association...