New Zealand : తెలుగు భాష ప్రచారానికి కంకణం కట్టుకుంటున్నారు. తెలుగు వారు ఎక్కడున్నా సమీకరించి వారిలో భాషాభిమానం పెరిగేందుకు పాటుపడుతోంది. ప్రస్తుతం న్యూజీలాండ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో రజతోత్సవ సంబరాల్లో భాగంగా న్యూజీలాండ్ లో తొలి తెలుగు అష్టావధానం నిర్వహిస్తున్నారు. దీనికి అందరు రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతున్నారు.
అవధాని సరస్వతి, శారదామూర్తి, ఈటవర్తి శ్రీ కల్యాణ చక్రవర్తి, సంచాలకులుగా మల్లికేశ్వర రావు వ్యవహరిస్తున్నారు. సమస్య మీద విశ్వనాథ్ విష్ణుబొట్ల, దత్తపది మీద ఎన్.పి. శ్రీనివాసరావు, వర్ణన మీద వెంకట అవధాని, నిషిద్ధాక్షరి నాగలక్ష్మి, న్యస్తాక్షరి మీద వాసు కూనపులి, ఆశువు మీద నాగరాజ విందమూరి, క్రతి పద్యం మీద సుదీక్ష రావూరు, శ్రావణి కూనపులి, అప్రస్తుతం మీద గోవర్థన్ మల్లెల అవధానం చేస్తారు.
దీనికి తెలుగు భాషాభిమానులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరుతున్నారు. ప్రపంచంలో తెలుగు వారు ఏ మూల ఉన్నా రావాలని ఆకాంక్షిస్తున్నారు. అష్టావధానంలో పాల్గొంటే భాష మీద మంచి పట్టు దొరుకుతుంది. పదాలు మనకు సులభంగా వస్తాయి. తెలుగు భాష తియ్యదనం తెలుసుకోవాలంటే అవధానంలో మనం పాల్గొంటేనే సాధ్యమవుతుంది.
భాష నైపుణ్యాన్ని పెంచుకునే ఇలాంటి అష్టావధానాలు ఎంతో ఉపయోగపడతాయి. భాష నైపుణ్యాన్ని పెంచుకుంటే మనకు ఉపయోగకరంగా ఉంటుంది. తెలుగు భాషలోని తియ్యదనం అమ్మ భాషలోని కమ్మదనం ఆస్వాదిస్తే కాని తెలియదు. ఇటీవల కాలంలో ఆంగ్లం మీద మోజుతో తల్లిభాషనే అవమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు గొప్పతనం నిలవాలంటే మనమందరం నడుం కట్టాల్సిందే.