Preservation of Telugu : తెలుగు భాష వ్యాప్తి కోసం ఎందరో శ్రమిస్తున్నారు. తెలుగు ఖ్యాతిని దశ దిశలా చాటాలని విశ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తెలుగు మాట్లాడే వారితో తెలుగులోనే మాట్లాడాలని సూచిస్తున్నారు. పాశ్చాత్య పోకడల ప్రభావంతో ఆంగ్లంలో మాట్లాడితే అదేదో గొప్ప అన్నట్లుగా చెప్పుకుంటారు. కానీ తల్లి భాష అయిన తెలుగులో మాట్లాడటమే మంచిదని పలువురు నిపుణులు చెబుతున్నారు.
ఇద్దరు తెలుగు వారు కలుసుకుంటే ఇంగ్లిష్ లోనే మాట్లాడుకుంటారని సామెత. తెలుగు భాషను గౌరవించాలి. భాషాభిమానం చాటాలి. ఇందులో భాగంగా మనం ఎక్కడ ఉన్నా తెలుగే మన పలుకు కావాలి. తెలుగే మన భాష కావాలని ఆశించడంలో తప్పు లేదు. తెలుగు భాష పరిరక్షణకు నడుం కట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అంతరించిపోతున్న భాషల్లో తెలుగు కూడా ఉండటం గమనార్హం. అందుకే మన భాషను మనమే రక్షించుకోవాలి. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని పెంచే తెలుగు భాషకు పట్టం కట్టాలి. ఈ సందర్భంగా నాట్స్ తెలుగు భాష పరిరక్షణపై అంతర్జాతీయ సదస్సులు నిర్వహిస్తోంది. ఈనేపథ్యంలో నాట్స్ లలిత కళా వేదిక ఆధ్వర్యంలో ప్రముఖ కవి, సాహితీవేత్త బాలంతపు వెంకటరమణ ముఖ్య అతిథిగా సదస్సు నిర్వహించారు.
తెలుగు భాష గొప్పతనం గురించి మాట్లాడారు. భాష పరిరక్షణ మనందరి బాధ్యత అని నినదించారు. ప్రవాసాంధ్ర కవి కిభశ్రీ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. తెలుగు భాష పరిరక్షణ కోసం నాట్స్ చేస్తున్న పనిని నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి కొనియాడారు. నాట్స్ చైర్ వుమెన్ అరుణ గంటికి ధన్యవాదాలు తెలిపారు. తెలుగు భాష ఔన్నత్యం గురించి వివరించారు.