
Garikapati Comments : గరికపాటి నర్సింహారావు గురించి తెలుగు రాష్ట్రాలే కాదు.. దేశంలో కూడా పరిచయం అక్కర్లేదు. ఆయన ఘనాపాటి, రెండు తెలుగు రాష్ట్రాల్లో సుప్రసిద్ధుడు. ఆయన చేసిన సేవలకు గానూ భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీతో సత్కరించింది.
మూఢ నమ్మకాలను తక్షణమే త్వజించాలని ఆయన తరుచూ ప్రవచనాలలో చెప్తుంటారు. గుడ్డిగా నమ్మవద్దని.. ప్రతీ దానికి తర్కం కోసం అన్వేషించాలని సూచిస్తుంటారు. ఆయన ప్రవచనాలకు చాలా మంది అభిమానులు ఉన్నారంటే సందేహం లేదు. వయస్సు రిత్యా చాగంటి కంటే పెద్ద వారు అయిన గరికపాటి ప్రవచనాలంటేనే ఎక్కువ మంది ఇష్టపడతారు.
ఇటీవల తెలంగాణలోని వనపర్తి జిల్లా, ఆత్మకూరులో భగవద్గీత ప్రచార పరిషత్ నిర్వహించిన ప్రవచన సభలో గరికపాటి నర్సింహా రావు కొత్త చర్చకు తెరలేపారు.
గరికపాటి నరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆంధ్రప్రదేశ్ లో తెలుగు భాష మునిగిపోయిందని, ఆంధ్రప్రదేశ్ కు బదులుగా రాష్ట్రాన్ని ఏపీ అని సంబోధించారు. ఇప్పటికీ టీఎస్ అని పిలువబడే తెలంగాణలో తెలుగు భాష పరిరక్షణ మెరుగ్గా ఉంటుందన్న తన నమ్మకానికి భిన్నంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
గరికపాటికి వివాధాలు కొత్తేమి కాదు. ఫ్యామిలీ విషయాలపై కూడా ఆయన సంచలన కామెంట్లు చేస్తుంటారు. గతంలో ఒక వేదికపై చిరంజీవిని మందలించిన ఆయన, విశ్వబ్రాహ్మణులు, పుష్ప సినిమా సహా పలు అంశాలపై ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, వైసీపీ నేతలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల తరహాలోనే ఈ ప్రకటన కూడా తీవ్ర చర్చకు దారితీసింది.