
విమెన్ ఎంపవర్మెంట్ తెలుగు అసోసియేషన్ ( women empowerment telugu association ) ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. మార్చి 14 , 2023 రోజున అమెరికాలోని డాలస్ లో ఈ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మహిళామణులు పాల్గొన్నారు. 600 మందికి పైగా మహిళామణులు అలాగే చిన్నారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ వేడుకలకు కారోల్టన్ డిప్యూటీ మేయర్ నాన్సీ క్లైన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మహిళలు చేస్తున్న సేవలను కొనియాడారు. ఝాన్సీ , శైలజా రెడ్డి , సంధ్య గవ్వ , శ్రీనివాస్ కవిత ఆకుల , సుమన గంగి , స్వాతి నేలభట్ల , నాగిని కొండేలా , డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి , నవ్య స్మ్రుతి , ప్రతిమా రెడ్డి , అనురాధ , హైమ అనుమాండ్ల , జయశ్రీ తేలుకుంట్ల , ప్రత్యూష నర్రపరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.