32.3 C
India
Wednesday, May 15, 2024
More

    Times Now Survey: టైమ్స్ నౌ సర్వేలో సంచలన విషయాలు.. తెలంగాణలో గెలుపు ఆ పార్టీదే!

    Date:

    Times Now Survey: తెలంగాణలో ఎన్నికలు దాదాపు రెండు నెల్లోనే ఉండబోతున్నాయి. ఈ నేపథ్యంలో టైమ్స్ నౌ అనే ఇంగ్లిష్ న్యూస్ ఛానల్ దేశ వ్యాప్తంగా లోక్ సభ గెలుపుపై సర్వే నిర్వహించింది. ఇందులో సంచలన విషయాలు బయట పడ్డాయి. తెలంగాణలో గెలుపు కోసం మూడు పార్టీలు హోరా హోరీ తలపడుతున్నాయి. అందులో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ఉన్నాయి.

    బీఆర్ఎస్ వైపే మొగ్గు
    అధికార బీఆర్ఎస్ 9 నుంచి 11 లోక్ సభ స్థానాలు గెలుస్తుందని సర్వే చెప్పింది. బీజేపీకి తెలంగాణలో 2 నుంచి 3, కాంగ్రెస్ కు 3 నుంచి 4, ఇతరులకు ఒక సీటు రానుందని పేర్కొంది. బీఆర్ఎస్‌కు 38.40 శాతం, 24.30 శాతం, ఇండియా కూటమికి 29.90 శాతం, ఇతరులకు 7.40 శాతం ఓట్లు వస్తాయని స్పష్టం చేసింది. మెజార్టీ ప్రజలు బీఆర్ఎస్ కే మద్దతిస్తున్నట్లు వెల్లడించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100 స్థానాలు సాధిస్తామని సీఎం కేసీఆర్ ధీమాగా చెబుతున్నారు. ఈ సమయంలోనే కాంగ్రెస్ తెలంగాణలో సీన్ మారిందని, ప్రజలు తమ వైపే ఉన్నారని ప్రచారం చేస్తోంది.

    కొద్ది రోజుల క్రితం బీఆర్ఎస్ వర్సస్ బీజేపీ రాజకీయం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా మారింది. బీజేపీ అంతర్గత సమస్యలతో వెనుకబడింది. అదే విషయం సర్వేలోనూ స్పష్టం అవుతోంది. బీఆర్ఎస్ గెలుపు సాధించగా, ఇండియా కూటమి తర్వాతి స్థానంలో ఉండనుంది. కాంగ్రెస్ తెలంగాణలో ఎన్డీఏ కంటే మెరుగైన స్థానంలో కొనసాగుతున్నట్లు లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం హోరా హోరీ పోరు తప్పదనే అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నెలలోనే అభ్యర్ధుల ఎంపిక దిశగా ప్రధాన పార్టీలు అడుగులు వేస్తున్నాయి.

    జాతీయ స్థాయిలో
    ఇప్పటికి ఇప్పుడు లోక్ సభ కు ఎన్నికలు జరిగితే ఎన్డీఏ కూటమికి 296 నుంచి 326 వరకు వస్తాయని అంచనా వేసింది. ఇందులో బీజేపీ బీజేపీ సొంతంగా 288 నుంచి 314 సీట్లు గెలుచుకుంటుందని పేర్కొంది. ఇక విపక్ష కూటమి ‘ఇండియా’కు 160 నుంచి 190 స్థానాలు లభిస్తాయని వెల్లడించింది. ‘ఇండియా’తో కాకుండా సొంతంగా కాంగ్రెస్ 62 నుంచి 80 స్థానాలు గెలుచుకొనే అవకాశాలు ఉన్నాయి. ఓట్ల పరంగా ఎన్డీఏకు 42.60 శాతం, ‘ఇండియా’ కూటమికి 40.20 శాతం లభిస్తాయని వెల్లడించారు. ఏపీలో వైసీపీకి 24 సీట్లు వస్తాయని అంచనా వేసింది.

    Share post:

    More like this
    Related

    Rajasthan : 22నెలల చిన్నారికి రూ.17.5కోట్ల ఇంజెక్షన్

    Rajasthan : రాజస్థాన్‌లో నివాసముంటున్న 22 నెలల హృదయాంశ్ శరీరంలోని చాలా...

    DC Vs LSG : లక్నో ఢమాల్.. ఢిల్లీ గెలుపు

    DC Vs LSG : ఢిల్లీ క్యాపిటల్స్ తో అరుణ్ జైట్లీ...

    NRI News : సూర్యపేట- ఖమ్మం హైవేపై మిస్ అయిన అమెరికా నుంచి వచ్చిన ప్రవాసుల బ్యాగులు

    NRI News : అమెరికా నుంచి వచ్చిన ప్రవాస భారతీయుల బ్యాగులు మిస్...

    Rashmika : సీ లింక్ బ్రిడ్జి ‘అటల్ సేతు’పై రష్మిక కామెంట్.. ఏమందంటే?

    Rashmika :జనవరిలో ప్రధాన మంత్రి మోదీ భారతదేశపు అతి పెద్ద సీ...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related