34.4 C
India
Thursday, May 16, 2024
More

    2023 Roundup: 10ఏళ్లలో 14దేశాల అవార్డులు.. ప్రధాని మోడీ రికార్డులు!

    Date:

    2023 Roundup
    2023 Roundup PM Modi awards

    2023 Roundup : ప్రధాని నరేంద్ర మోడీ చరిష్మా, ఆయన ఖ్యాతి.. ప్రపంచ వ్యాప్తంగా ఆయనకున్న ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తన ఇమేజ్ తో బీజేపీని రెండోసారి అధికారంలోకి తెచ్చిన ఘనత ఆయనదే. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ ఉన్న ప్రధానిగా ఆయన్ను దాటేసేవారు లేరు. ఆయన ఏ దేశానికి వెళ్లినా అక్కడా మోడీ.. మోడీ అంటూ మారుమోగిపోవాల్సిందే. అలా ఉంటుంది ఆయన క్రేజ్.

    ప్రధాని మోడీ హయాంలో దేశంలో పలు మార్పులు వచ్చాయి. కరోనాను సమర్థంగా ఎదుర్కొవడం, 370ఆర్టికల్ రద్దు, రామాలయం నిర్మాణం.. ఇలా దేశంలో ఎవరూ ఊహించలేని పనులు ఆయన చేశారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే జీ-20 నిర్వహణ, బ్రిక్స్, క్వాడ్ ..వంటి వేదికలపై ఆయన రాజకీయ చతురతను కొనియాడకుండా ఉండలేం. అమెరికాకు సైతం దీటుగా సమాధానం చెప్పే ఏకైక దేశం ఇండియా.. ప్రధాని మోడీ అని గర్వపడాల్సిందే. ‘‘ఈ యుగం యుద్ధాలది కాదు’’ అని ప్రపంచానికి సూచించిన నేత కూడా మోడీనే.

    ప్రధాని మోడీ రాజనీతిజ్ఞతకు, పరిపాలన దక్షతకు..2014 నుంచి ఇప్పటి వరకు 14 దేశాలు అవార్డులు అందించినట్టు కేంద్రం తాజాగా వెల్లడించింది. అవెంటో ఒకసారి చూద్దాం..

    * 2016లో ఆఫ్ఘనిస్తాన్ స్టేట్ ఆర్డర్ ఆఫ్ ఘాజీ అమీర్ అమానుల్లా ఖాన్ అవార్డు

    * 2018 లో పాలస్తీనా నుంచి గ్రాండ్ కాలర్ పాలస్తీనా

    * 2018లోనే ఐరాస నుంచి యూఎన్ చాంపియన్ ఆఫ్ ది ఎర్త్ అవార్డు

    * 2019 లో యూఏఈ నుంచి ఆర్డర్ ఆఫ్ జాయెద్

    * 2019 లో రష్యా నుంచి ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ

    * 2019 లో మాల్దీవులు నుంచి ఆర్డర్ ఆఫ్ ది డిస్టింగ్విస్ట్ రూల్ ఆప్ ఇజుద్దీన్

    * 2019 లో బహ్రెయిన్ నుంచి కింగ్ హమద్ ఆర్డర్ ఆఫ్ ది రినైసెన్స్

    * 2020 లో అమెరికా సంయుక్త రాష్ట్రాల నుంచి లెజియన్ ఆఫ్ మెరిట్

    * 2021లో భూటాన్ నుంచి ఆర్డర్ ఆఫ్ ది డ్రాగన్ కింగ్

    * 2023 ఫిజి నుంచి ఆర్డర్ ఆప్ ఫిజీ

    * 2023లో పాపువా న్యూ గినియా నుంచి ఆర్డర్ ఆఫ్ లోగోహు

    * 2023 లో ఈజిప్లు నుంచి ఆర్డర్ ఆఫ్ ది నైలు

    * 2023లో ఫ్రాన్స్ నుంచి గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ ఆనర్

    * 2023 లో గ్రీస్ నుంచి గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆనర్

    Share post:

    More like this
    Related

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    Hyderabad News : పెంపుడు కుక్క విషయంలో ఘర్షణ – కుక్కతో పాటు ముగ్గురికి తీవ్రగాయాలు

    Hyderabad News : హైదరాబాద్ లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధి...

    Kavya Thapar : డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్ గా కావ్య థాపర్?

    Kavya Thapar : తెలుగులో ‘ఒక మినీ కథ’, ఇటీవల ‘ఊరు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Kishan Reddy : రెండంకెల ఎంపీ స్థానాలు గెలుస్తాం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

    Kishan Reddy : రెండంకెల ఎంపీ స్థానాలు గెలిచి తెలంగాణలో బీజేపీ...

    PM Modi : పోలింగ్ బూత్ వద్ద మోడీకి రాఖీ కట్టిన మహిళ..

    PM Modi : అహ్మదాబాద్ లోని రాణిప్ లోని నిషాన్ విద్యాలయంలో...