33.6 C
India
Monday, May 20, 2024
More

    Actress Urvashi : మరో స్టార్ కిడ్ హీరోయిన్ గా ఎంట్రీ..

    Date:

    Actress Urvashi
    Actress Urvashi Daughter

    Actress Urvashi : ఫిలిం ఇండస్ర్టీలో టెక్నీషియన్లుగా, హీరోలుగా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా రాణిస్తున్న వారు తమ వారసులను కూడా సినిమా రంగంలోకి తీసుకువస్తున్న విషయం తెలిసిందే. అయితే సినిమా రంగంలో ఏదో ఒక శాఖలో మంచి స్థాయిలో ఉన్న వారు తమ పిల్లలను హీరో లేదా హీరోయిన్ గా  మాత్రమే ఎంట్రీ ఇచ్చేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇప్పుడు అదే కోవలో ఒకప్పటి హీరోయిన్, ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్న ఊర్వశి తన కూతురును హీరోయిన్  చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టేసింది.

    ఒకప్పటి ప్రముఖ హీరోయిన్లు రాధిక, రాధ, శ్రీదేవి తదితరులు తమ పిల్లలను హీరోయిన్లుగా పరియం చేశారు. వారిలో కొందరు సక్సెస్ అయ్యి రాణిస్తున్నారు కూడా.

    ఒకప్పుడు  హీరోయిన్‏గా అలరించి ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీగా  వారిలో ఊర్వశి కూడా ఒకరు. ఇప్పటి ప్రేక్షకులకు ఆమె పేరు అంతగా తెలియకపోవచ్చు. కానీ ఇటీవల ఆమె చేస్తున్న సినిమాలు చూస్తున్న వారు వెంటనే గుర్తు పడతారు. తల్లి, పిన్ని రోల్స్ తో అనేక చిత్రాల్లో నటించి ఆకట్టుకున్నారు. సమంత నటించిన ఓ బేబీ సినిమాలో రాజేంద్రప్రసాద్ మరదలిగా కనిపించి ఆద్యంతం నవ్వులు కురిపించారు. అలాగే శర్వానంద్ నటించిన ఆడాళ్లు మీకు జోహార్లు సినిమాలో కూడా  కీ రోల్ చేశారు. తెలుగు, తమిళంలో ఎన్నో చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు చేసి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు.  ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు యాక్టర్ ఊర్వశి.

    ఎన్నో చిత్రాల్లో నటించిన ఊర్వశి తన కుటుంబంతో కలిసి బయట ఎక్కడా కనిపించలేదు. ఆమె కుటుంబం, పిల్లలను ఆన్ స్ర్కీన్ మీదకు ఎప్పుడూ తీసుకురాలేదు. ఇప్పుడు ఆమె కూతురు కుంజత.. తేజ లక్ష్మి పేరు సోషల్ మీడియాలో మోత మోతున్నది. త్వరలోనే తేజ లక్ష్మీ హీరోయిన్‎గా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తున్నది.

    ఊర్వశి తన ఇన్‌స్టా గ్రామ్ లో  షేర్ చేసిన ఫ్యామిలీ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. అందులో ఊర్వశి తన కూతురు తేజ లక్ష్మితో ఎంతో సరదాగా నవ్వుతూ కనిపిస్తున్నారు. తన కూతురు తేజ లక్ష్మి త్వరలోనే సినీ ఫీల్డ్ లోకి అడుగుపెట్టనుందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు ఊర్వశి. ఇప్పటికే స్టోరీలు వింటున్నట్లు చెప్పారు. ఊర్వశి 2000లో కేరళ నటుడు మనోజ్ జైన్ ను ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి కూతురు తేజ లక్ష్మి ఉన్నారు. ఎనిమిదేళ్ల తర్వాత మనస్పర్థలు రావడంతో ఇద్దరూ విడిపోయారు. 2013లో శివప్రసాద్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వీరికి బాబు ఇషాన్ పుట్టాడు. ఊర్వశి ప్రస్తుతం తెలుగు, తమిళం చిత్రాలతో బిజీగా ఉంది. అయితే ఇన్ స్టాలో వైరలవుతున్న ఫోటోస్ చూస్తుంటే ఊర్వశి కూతురు తేజ లక్ష్మి, కుమారుడు ఇషాన్ ఓ సినిమా సెట్ లో సందడి చేసినట్లుగా టాక్ నడుస్తున్నది.

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related