AP Elections Notification : ఎప్పుడు ఎప్పుడా అని ఎదురుచూస్తున్న.. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. మార్చి 12 తారీఖున అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కాబోతున్నట్లు సమాచారం అందుతోంది. ఈ మేరకు ప్రధాన ఎన్నికల అధికారి,ఆంధ్రప్రదేశ్ – భారత ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేయబోతోంది. నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి పోలింగ్ వరకు వివరాలు ఇలా ఉన్నాయి.
12-3-2024 = ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది.28-3-2024 = నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. 19-4-2024 = పోలింగ్ నిర్వహిస్తారు.22-5-2024 = కౌంటింగ్ తో పాటు ఫలితాలు వెలుపడతాయి. 30-5-2024 న కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. ఈ అంశాలపై భారత ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.