Bandi sanjay తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ఒక వెలుగు వెలిగారు. ఆయన బాధ్యతలు తీసుకున్నాకే తెలంగాణలో ఊపు వచ్చిందని శ్రేణులు చెబుతుంటాయి. అయితే ఒక్కసారిగా ఏం జరిగిందో తెలియదు కానీ..ఆయనను బాధ్యతల నుంచి తొలగించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఆ బాధ్యతలు అప్పగించారు. ఇక బండి సంజయ్ కి కేంద్ర మంత్రి పదవి దక్కుతుందని ప్రచారం జరిగింది. కానీ అలాంటి నిర్ణయమేమి రాలేదు.
అయితే సంజయ్ ని తొలుత జాతీయ కార్యవర్గంలోకి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. తాజాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆయనకు అవకాశం కల్పించారు. బీజేపీ అగ్రనేతల మద్దతు ఉన్న బండి సంజయ్ కి, ఈ సారి మరో కీలక బాధ్యతలు అప్పగించబోతున్నట్లు తెలుస్తున్నది. ఇక ఏపీ బీజేపీ ఇన్చార్జిగా బండి సంజయ్ కి బాధ్యతలు అప్పగించబోతున్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే అక్కడ బీజేపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరిని నియమించారు. తెలంగాణలోలాగే ఏపీలో కూడా పార్టీని బలోపేతం చేసే బాధ్యతలను బండికి అప్పగించాలనుకుంటున్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం ఏపీ ఇన్చార్జిగా ఉన్న సునీల్ ధియోధర్ను జాతీయ కార్యవర్గం నుంచి తొలగించారు. దీంతో ఏపీ బాధ్యతలు కూడా తొలగిస్తారని ప్రచారం జరుగుతున్నది.
మరోవైపు గతంలో ఏపీలో తిరుపతి ఎన్నికల సమయంలో బండి సంజయ్ చేసిన హడావుడి అంతా ఇంత కాదు. ఏకంగా ఈ ఎన్నికలు గుడి, చర్చిల మధ్యలో అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవి అప్పుడు కలకలం రేపాయి. ఏకంగా ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదులు వెళ్లాయి. అయితే ఏపీలో కులాల మధ్య రాజకీయం జరిగేదే. బండి వెళ్లాక మతాల మధ్యకు మారేలా ఉందని అంతా అభిప్రాయపడ్డారు. దీంతో హైకమాండ్ కు నాడు ఫిర్యాదులు వెళ్లాయి. ఈ క్రమంలో తాజాగా బండికి మరోసారి ఏపీ ఇన్చార్జిగా బాధ్యతలు అప్పజెప్పబోతున్నట్లు టాక్ వినిపిస్తున్నది. ప్రస్తుతం ఏపీలో అధికార పార్టీని మాటలతో ఢీకొట్టే నేతలెవరూ బీజేపీలో లేరు. అందుకే బండిని రంగంలోకి దించాలని చూస్తున్నట్లు తెలుస్తున్నది. అయితే బండిని ఏపీలో రంగంలోకి దించడం వెనుక అధిష్టానం పక్కా వ్యూహం మేరకే వెళ్తున్నదని టాక్ వినిపిస్తున్నది.
ReplyForward
|