AP Volunteers : వాలంటీర్లపై పాతపట్నం వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశం గా మారాయి. వాలంటీర్లు జగనన్న నియమించిన సైనికులు అవసరమైతే ఎన్నికల్లో ఓటర్లకు నగదు పంపిణీ చేయాలని ఆమె వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.
వాలంటీర్లతో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే ఇ లా మాట్లాడారు. ఎన్నికల్లో గెలవాలంటే వాలంటీర్ల సహకారం కావాలన్నారు. వాలంటీర్లు జగనన్న రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందని దాన్ని ఎవ రు వదులుకోవద్దని ఆమె అన్నారు. అన్ని ఓట్లు వైసిపికి వేయించే బాధ్యత వాలంటీర్ల పై ఉందని కాకినాడ ఎంపీ వంగా గీత వ్యాఖ్యానించారు.
ఎన్నికల విధులకు వాలంటీర్లను దూరంగా ఉంచా లని ఇప్పటికే ప్రతిపక్ష పార్టీల నేతలు ఆగ్రహం వ్య క్తం చేస్తున్నారు. కొంతమంది ఎమ్మెల్యే ,ఎంపీలు ఇలా బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తున్నడంతో పలు వురు విమర్శలు చేస్తున్నారు. ఎన్నికల కమిషన్ దీనిపై దృష్టి పెట్టాలని ప్రతిపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేస్తున్నారు.