Sukanya Samriddhi Yojana భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం చేపట్టిన తర్వాత ఎన్నో అద్భుతమైన పథకాలను చేపట్టింది. అందులో భాగంగా వచ్చిందే ‘సుకన్య సమృద్ధి యోజన’. చిన్న మొత్తాల పథకంగా వచ్చిన చాలా పాపులర్ అయ్యింది. ఈ పథకం ఆడ పిల్లలు ఉన్న తల్లిదండ్రులకు ఒక వరం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇందులో పైసా పైసా కూడేస్తే.. చివరికి అది పెద్ద మొత్తంగా చేతికి అందుతుంది. పైగా ఈ ఖాతాకు ప్రభుత్వం చెల్లించే వడ్డీ రేటు కూడా ఎక్కువే. దీంతో తల్లిదండ్రులు తక్కువ చెల్లించినా ప్రభుత్వం ఎక్కువ మొత్తం కలిపి మరీ కుటుంబానికి అందజేస్తుంది.
ఆడ బిడ్డల ఉన్నత చదువులు, వివాహ ఖర్చులకు ఈ డబ్బు ఎంతో ఉపయోగపడుతుందని ఎక్కువ మంది తల్లిదండ్రులు ఈ పథకంలో చేరారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ఆటంకం లేకుండా ఈ పథకం నడుస్తోంది. అయితే ఈ మధ్య కేంద్రం ఈ పథకం విషయంలో మరికొన్ని మార్గదర్శకాలను తీసుకువచ్చింది. సుకన్య సమృద్ధి యోజనలో ఉన్న వారు ఆ ఖాతాకు పాన్, ఆధార్ కార్డులను లింక్ చేసుకోవాలని సూచించింది. అయితే దానికి గడువు కూడా విధించింది. గడువు లోగా లింక్ చేసుకోకుంటే పథకానికి సంబంధించిన అకౌంట్ ఫ్రీజ్ అవుతుందని చెప్పింది.
కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ 2023, మార్చి 31న తీసుకువచ్చిన కొన్ని రూల్స్ లో భాగంగా సుకన్య సమృద్ధి యోజననే కాకుండా.. పీఎఫ్ లాంటి వాటికి కూడా ఈ రూల్ ను వర్తింప జేస్తోంది. కేవైసీల్లో ప్రధానమైన మార్పులు తీసుకువచ్చింది కేంద్రం. గతంలో ఈ పథకంలో చేరేందుకు ఎలాంటి రూల్స్ ఉండేవి కాదు. కానీ కొత్త రూల్స్ పథకం ప్రకారం.. ఆధార్ లేదంటే ఆధార్ ఎన్ రోల్ మెంట్ నెంబర్ తప్పని సరి చేసింది. 2023, సెప్టెంబర్ 30లోగా ఆధార్ నెంబర్ సబ్మిట్ చేయాలి. గతంలోనే ఇచ్చిన వారికి ఈ నిబంధన వర్తించదు. పాన్ కూడా లేకుంటే పాన్ నెంబర్ తప్పనిసరిగా ఇవ్వాలి.