Are You sure bandi Sanjay union Minister post : భారతీయ జనతా పార్టీలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పార్టీ అధ్యక్షులను మారుస్తున్నారు. కేంద్రంలో ముచ్చటగా మూడోసారి మోడీ ప్రభుత్వం కొలువుదీరాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే కేంద్ర కేబినెట్ కూడా విస్తరించనున్నారు. దీంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా చేసిన బండి సంజయ్ కు కేంద్ర మంత్రి పదవి గ్యారంటీ అని విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలో సంజయ్ ని మార్చడంపై విమర్శలు వస్తున్నాయి. బండి సంజయ్ పార్టీని తెలంగాణలో గాడిలో పెట్టారు. కానీ ఆయనను పదవి నుంచి తొలగించడంపై అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
కేంద్రంలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. విపక్షాల ఎత్తుగడలు ఎదుర్కొనేందుకు బీజేపీ కూడా సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే పార్టీలో మార్పులు తీసుకొస్తోంది. ప్రక్షాళన ప్రారంభించింది. దీంతో పలు రాష్టాల్లో పార్టీ అధ్యక్షులను మార్చారు. కానీ బండి సంజయ్ ను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించడంపై కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు.
సంజయ్ పార్టీలో మంచి జోష్ తీసుకొచ్చారు. తన శాయిశక్తుల కష్టపడి పార్టీని గాడిలో పెట్టినా ఆయనను తొలగించడం ఏమిటని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. పార్టీని మంచి స్థాయికి తీసుకొచ్చిన అతడికి కేంద్ర మంత్రిగా పదవి ఇచ్చినా రాష్ట్రంలో రాజకీయాలు మాత్రం సెట్ కావనే సంగతి తెలియదా అని ప్రశ్నిస్తున్నారు. నడిచే నావను నడవకుండా చేసిన పార్టీ యంత్రాంగం ఏం చర్యలు తీసుకుంటుందో అని చూస్తున్నారు
బండి సంజయ్ కి కేంద్ర మంత్రి పదవి ఇచ్చినా రాష్ట్రంలో రాజకీయాలు మాత్రం గాడిలో పడవు. కేంద్ర అధినాయకత్వం ఎందుకు ఇలా వ్యవహరిస్తుందో తెలియడం లేదని కార్యకర్తలు బాహాటంగానే విమర్శలు చేస్తున్నారు. పార్టీ అధ్యక్షుల మార్పు మాత్రం హర్షించదగినది కాదని అంటున్నారు. అధినాయకత్వం విధానాలు అంతుచిక్కకుండా ఉన్నాయి.
ReplyForward
|