Digital Voter ID : భారతదేశంలో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరికి కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ గుర్తింపు కార్డులను ఇస్తుంది. గుర్తింపు కార్డు ఓటింగ్ కేంద్రంలోని కాకుం డా చాలా సందర్భాల్లో ఉపయోగపడుతుంది. అయితే ప్రతిసారి దానినీ మనం వెంట తీసుకెళ్ల లేము. ఒక్కోసారి ఇంట్లోనే మరచి వెళ్ళినప్పుడు అవసరమైతే పని ఆగిపోయే పరిస్థితి కూడా తలెత్తుతాయి.
ఇకపై ఆ సమస్య ఎదురవ్వకుండా మీ ఫోన్లోని ఈ డిజిటల్ హోటల్ ఐడి కార్డును డౌన్లోడ్ చేసుకోవ చ్చు. కేంద్ర ఎన్నికల సంఘం రెండేళ్ల క్రితమే డిజిట ల్ ఓటర్ కార్డు డౌన్లోడ్ చేసుకుని సదుపాయాన్ని తీసుకొచ్చింది.
డిజిటల్ కార్డు డౌన్‌లోడ్ ఇలా..
స్టెప్ 1: ముందుగా ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్ https//cei.gov.in/ఈ+epic/లోకి వెళ్ళండి.
స్టెప్లో 2: ఈసీ వెబ్సైట్లో ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్నట్లయితే ఆ వివరాలతో లాగిన్ కావాలి.. లేకపోతే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి..
స్టెప్ 3: వెబ్సైట్లో లాగిన్ అయిన తర్వాత హోమ్ పేజీలో e-epic download అనే ఆప్షన్ కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయాలి.
స్టెప్ 4: మీ ఓటర్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి రాష్ట్రం పేరు సెలెక్ట్ చేసి సెర్చ్ చేయాలి..
స్టెప్ 5: వివరాలన్నీ పూర్తి చేసిన తర్వాత సెండ్ ఓటిపి పైన క్లిక్ చేయాలి..
స్టెప్ 6: ఆ ఓటర్ ఐడి కార్డుకు లింక్ అయినా మీ మొబైల్ నెంబర్ కు ఓటిపి వస్తుంది. ఓటిపి ఎంటర్ చేస్తే మొబైల్ నెంబర్ వెరిఫై అవుతుంది.
స్టెప్ 7: ఆ తర్వాత క్యాప్చ కోడ్ ఎంటర్ చేసి డౌన్లోడ్ ఎపిక్ పైన క్లిక్ చేయాలి.
స్టెప్ 8: నాన్ ఎడిటబుల్ పిడిఎఫ్ ఫార్మాట్లో డిజిటల్ ఓటర్ ఐడి కార్డ్ డౌన్లోడ్ అవుతుంది. అంతే నిమిషాల్లో మీ స్మార్ట్ ఫోన్లో డీసెల్ కార్డు ఉంటుంది.
మరోవైపు కొత్తగా ఓటర్ నమోదు చేసుకున్న వారు ఓటర్ ఐడి లేకపోతే ఫామ్ 6 రెఫరెన్స్ నెంబర్ తో డిజిటల్ ఓటర్ ఐడి కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఈ డివిజన్ కార్డును డౌన్లోడ్ చేసుకోవా లంటే నేషనల్ ఓటర్స్ సర్వీస్ పోర్టల్ లో రిజిస్టర్ అయి ఉండాలి. అలాగే ఓటర్ ఐడి కార్డు కి మొబై ల్ నెంబరు అప్డేట్ చేసుకొని ఉండాలి.