Ginger Garlic Paste : ప్రస్తుతం రెడీమేడ్ అల్లం వెల్లుల్లి పేస్టును ప్రజలు ఎక్కువగా వినియోగిస్తున్నారు. సిటీలో అయితే వీటికి మరీ డిమాండ్ ఎక్కువనే చెప్పాలి. దీన్ని క్యాష్ చేసుకొని నాసిరకం ఉత్పత్తులు తయారు చేస్తున్నారు కొందరు కేటుగాళ్లు.
తాజాగా హైదరాబాదులోని ప్యూర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పరిశ్రమలో కుళ్ళిన పదార్థాలు వాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఫేక్ టర్మరిక్, గమ్, సోడియం, బెంజియన్, పౌడర్ వంటి హానికర రంగులు ఉండడంతో ఆశ్చర్యపోయారు.
బయట షాపుల్లో దొరుకుతున్న అల్లం , వెల్లుల్లి ప్రెస్ ల వాడకాన్ని నిలిపివేయాలని పోలీస అధికారులు హెచ్చరిస్తున్నారు. రెడీమేడ్ అలవాటు పడి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను వాడితే రోగాలు కొన్ని తెచ్చు కున్నట్లే అని వారు హెచ్చరిస్తున్నారు.