31.4 C
India
Monday, May 20, 2024
More

    Purandeshwari : రంగంలోకి పురందేశ్వరి.. ఏపీ బీజేపీ గాడిలో పడేనా..?

    Date:

    purandeshwari
    purandeshwari

    Purandeshwari :

    ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరి ఇటీవల బాధ్యతలు తీసుకున్నారు. సమర్థత గల నాయకురాలిని పార్టీ అధ్యక్షురాలిగా నియమించడంలో శ్రేణులు కూడా సంబురపడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు బిడ్డగానే కాకుండా ఆమెకు రాష్ర్ట రాజకీయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. గతంలో ఆమె కేంద్ర మంత్రిగా కూడా పని చేశారు. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడం పురందేశ్వరికి సాధ్యమవుతుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. అనుకున్నట్లుగానే  ఆమె రంగంలోకి దిగినిట్లు కనిపిస్తున్నది. ఆమె బాధ్యతలు తీసుకున్న వెంటనే అధికార వైసీపీ ఎదురు దాడి మొదలు పెట్టారు. తాజాగా ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి మరి జగన్ ప్రభుత్వం తీరుపై స్పందించారు.

    దీంతో పాటు ఏపీకి రాజధాని అమరావతి మాత్రమేనంటూ ఆమె జాతీయ పార్టీ ఏపీ అధ్యక్షురాలి హోదాలో తేల్చేశారు. తాజాగా గుంటూరులో జరిగిన బీజేపీ కోస్తాంధ్ర జోనల్ సమావేశంలో ఆమె ఈ మేరకు ప్రకటించారు. ఇకపై సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడమే తన లక్ష్యమని చెప్పారు. క్షేత్రస్థాయిలోకి వెళ్తానని పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా పార్టీలోని ప్రతి నాయకుడిని కలుపుకొని వెళ్తానని చెప్పారు. అయితే రాజమండ్రిలో జరిగే గోదావరి జోనల్ సమావేశానికి బుధవారం ఆమె హాజరుకానున్నారు. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలపై ఇక పోరాటం తప్పదని స్పష్టం చేయనున్నారు. ఏపీలో ఇక బీజేపీ గాడిలో పడినట్లేనని అంతా చర్చించుకుంటున్నారు. పార్టీ బలోపేతంపై పురందేశ్వరి వేగంగా వేస్తున్న అడుగులు, సమాలోచనలు సఫలికృతం కావాలని శ్రేణులు భావిస్తున్నాయి.

    ఆమె అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు మొదలు పెట్టారు. రాష్ర్టంలో వ్యవస్థ మొత్తం భ్రష్టుపట్టిందని మండిపడ్డారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ మార్పు పై కూడా ఆమె మరోసారి స్పందించారు. ఇది ఆ మహానుభావుడిని అవమానించడమేనని మండిపడ్డారు. దీనిపై ఖచ్చితంగా తమ వ్యతిరేకతను చూపుతామని చెప్పారు. అయితే వైసీపీ ప్రభుత్వ తీరుపై ఇక రాష్ర్ట వ్యాప్త నిరసనలకు కార్యాచరణ రూపొందిస్తామని, ప్రజల్లోకి వెళ్లి జగన్ వైఖరిని ఎండగడుతామని చెప్పారు. జాతీయ నాయకత్వం మార్గదర్శకత్వంలో పనిచేస్తానని, రాష్ర్ట ప్రయోజనాల కోసం పాటుపడతానని చెప్పుకొచ్చారు. పొత్తుల అంశం జాతీయ అగ్ర నాయకత్వం తీసుకుంటుందని తేల్చి చెప్పారు. అయితే రాష్ర్టంలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై తమ పోరాటం మాత్రం ఆగదని స్పష్టం చేశారు. అయితే సీఎం జగన్ కు మాత్రం పురందేశ్వరి గట్టి వార్నింగే ఇస్తున్నట్లు కనిపిస్తున్నది. ఇకపై ప్రభుత్వం పై పోరాటమేనని చెప్పడం ద్వారా ఆమె అధిష్టానం నిర్ణయం కూడా ఇదే అనే సంకేతాలు పంపారు.

    Share post:

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Arvind Kejriwal : ఆప్ అంతానికి బీజేపీ ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్

    Arvind Kejriwal : ఆప్ నేతలను అరెస్టు చేసి జైళ్లకు పంపించేందుకు...

    Prajwal Revanna : ప్రజ్వల్ కు అరెస్ట్ వారెంట్ జారీ

    Prajwal Revanna : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక లైంగిక...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    KCR Situation : చివరకు కేసీఆర్ పరిస్థితే జగన్ కు?

    KCR Situation :  రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయ్యాయి. తెలంగాణలో...

    Pinnelli Brothers : పిన్నెల్లి బ్రదర్స్ ఆ రోజు ఇంటి వెనుక గోడ దూకి.. ఈసీ దర్యాప్తులో సంచలన నిజాలు..

    Pinnelli Brothers : పల్నాడు జిల్లా, మాచర్లలో పోలింగ్ ప్రక్రియకు తీవ్ర...

    Viral Video : వైసీపీ పాలనపై బాధగా ఉంది.. – సోషల్ మీడియాలో వీడియో వైరల్

    Viral Video : రకరకాల అబద్దాలతో గత ఐదు సంవత్సరాలుగా పాలన...

    Women Voters : ఓటెత్తిన మహిళలు.. కలిసొచ్చేది ఎవరికో..?

    Women Voters : ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ జాతరను తలపిస్తున్నది. పోలింగ్...