31.9 C
India
Friday, May 17, 2024
More

    Chandrababu : రిమాండ్‌ సబబే.. క్వాష్‌ కొట్టేయలేం.. చంద్రబాబుకు బిగ్‌ షాక్‌.. సుప్రీంకోర్టులో దక్కని ఊరట

    Date:

    Chandrababu
    Chandrababu
    • రిమాండ్‌ విధించే అధికారం ట్రయల్‌ కోర్టుకు ఉందన్న సుప్రీంకోర్టు
    • రిమాండ్‌ సమంజసమేనని తేల్చిచెప్పిన ఇద్దరు న్యాయమూర్తులు
    • 17ఏ సెక్షన్‌కు రిమాండ్‌ను ముడిపెట్టలేమని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు
    • 17ఏ సెక్షన్‌ వర్తింపు విషయంలో మాత్రం భిన్నాభిప్రాయాలు
    • తదుపరి నిర్ణయం కోసం సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌కు నివేదన
    • ముగ్గురు లేదా అయిదుగురు జడ్జిల బెంచ్‌ ???

    స్కిల్‌ స్కాం కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఎలాంటి ఊరట దక్కలేదు. ఆయన దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం భిన్న తీర్పులు వెలువరిచింది. ఈ క్రమంలో.. చీఫ్‌ జస్టిస్‌ నేతృత్వంలోని విస్తృత ధర్మాసనానికి బాబు క్వాష్‌ పిటిషన్‌ను బదిలీ చేసింది. అయితే ఇద్దరు న్యాయమూర్తులు కూడా రిమాండ్‌ కొట్టేయలేమని చెప్పడం చంద్రబాబుకు భారీ షాక్‌ లాంటిది. రిమాండ్‌ విధించే అధికారం ట్రయల్‌ కోర్టు అంటే విజయవాడలోని ACB కోర్టుకు పూర్తిగా ఉందని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది.

    తీర్పు ఎలా వెలువరిచారంటే..

    తీర్పులో 17-ఏ వర్తింపుపై ఇద్దరు న్యాయమూర్తులు వేర్వేరు అభిప్రాయాలు వెల్లడించారు.

    స్కిల్‌ కేసులో చంద్రబాబుకు అవినీతి నిరోధక శాఖలోని సెక్షన్‌ 17-ఏ వర్తిస్తుందని జస్టిస్‌ అనిరుద్ధబోస్‌ తీర్పు ఇవ్వగా..
    17-ఏ వర్తించదని జస్టిస్‌ బేలా ఎం.త్రివేది తీర్పు ప్రకటించారు.

    ముందుగా జస్టిస్‌ బోస్‌ తీర్పు చదువుతూ..
    “ఈ కేసులో 17ఏ వర్తిస్తుంది. చంద్రబాబు కేసులో విచారణకు ముందే గవర్నర్‌ అనుమతి తీసుకోవాల్సింది. గతంలో జరిగిన దర్యాప్తును ఈ అరెస్ట్‌కు వర్తింపజేయరాదు. అయినా చంద్రబాబుకు విధించిన రిమాండ్‌ ఆర్డర్‌ను కొట్టేయలేం. అనుమతి లేనంత మాత్రాన రిమాండ్‌ ఆర్డర్‌ నిర్వీర్యం కాదు.” అని జస్టిస్‌ బోసు తీర్పు ఇచ్చారు.

    జస్టిస్‌ బేలా త్రివేది మాత్రం ఈ తీర్పుతో విభేదించారు.
    ‘‘ఈ కేసులో చంద్రబాబుకు 17-ఏ వర్తించదు. 2018లో వచ్చిన సవరణ ఆధారంగా చేసుకుని కేసును క్వాష్‌ చేయలేం. 2018లో వచ్చిన సవరణ కేవలం తేదీకి సంబంధించినది మాత్రమే. అవినీతి నిరోధక చట్టానికి 17ఏను ముడిపెట్టలేం. అధికారాన్ని అడ్డుపెట్టుకుని నేరానికి పాల్పడిన వారికి 17ఏ రక్షణగా ఉండకూడదు. అవినీతి నిరోధక చట్టంలో ఇచ్చిన మినహాయింపు కేవలం ఉద్యోగులు కక్ష్యసాధింపుకు గురి కావద్దని మాత్రమే’’ అని జస్టిస్‌ త్రివేది తీర్పు ఇచ్చారు.

    మొదటి తీర్పు : జస్టిస్‌ బోస్‌ ఏమన్నారంటే..

    ఈ కేసులో 17ఏ వర్తిస్తుంది
    చంద్రబాబు కేసులో విచారణకు ముందే గవర్నర్‌ అనుమతి తీసుకోవాల్సింది
    గతంలో జరిగిన దర్యాప్తును ఈ అరెస్ట్‌కు వర్తింపజేయరాదు
    అయినా చంద్రబాబుకు విధించిన రిమాండ్‌ ఆర్డర్‌ను కొట్టేయలేం
    అనుమతి లేనంత మాత్రాన రిమాండ్‌ ఆర్డర్‌ నిర్వీర్యం కాదు
    రిమాండ్‌ రిపోర్ట్‌ను కొట్టేయాలని గానీ, చెల్లుబాటు కాదని గానీ చెప్పలేం, రిమాండ్‌ చెల్లుతుంది, కొనసాగుతుంది

    రెండో తీర్పు : జస్టిస్‌ బేలా త్రివేది ఏమన్నారంటే..

    చంద్రబాబు పిటిషన్‌కు 17ఏ వర్తించదు
    2018లో వచ్చిన సవరణ ఆధారంగా చేసుకుని కేసును క్వాష్‌ చేయలేం
    పాత కేసులకు 17ఏ వర్తించదు, సవరణ వచ్చిన తర్వాత జరిగిన నేరాలకు మాత్రమే సెక్షన్‌ వర్తిస్తుంది.. కానీ చంద్రబాబు కేసుకు వర్తించదు
    2018లో వచ్చిన సవరణ కేవలం తేదీకి సంబంధించినది మాత్రమే
    అవినీతి నిరోధక చట్టం కింద నమోదయిన ఈ కేసును 17ఏకి ముడిపెట్టి ఊరట ఇవ్వలేం
    అధికారాన్ని అడ్డుపెట్టుకుని నేరానికి పాల్పడిన వారికి 17ఏ రక్షణగా ఉండకూడదు
    అవినీతి నిరోధక చట్టంలో ఇచ్చిన మినహాయింపు కేవలం ఉద్యోగులు కక్ష్యసాధింపుకు గురి కావద్దని మాత్రమే. గవర్నర్ అనుమతి లేదనే కారణంతో FIRను క్వాష్ చేయడం కుదరదు
    ట్రయల్‌ కోర్టు (ACB కోర్టు, విజయవాడ) ఇచ్చిన రిమాండ్‌ పూర్తిగా సబబే
    దర్యాప్తు కొనసాగించవచ్చు, ఛార్జ్‌షీట్‌ దాఖలు చేయవచ్చు, న్యాయప్రక్రియ కంటిన్యూ అవుతుంది

    Share post:

    More like this
    Related

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బాడీగార్డు ఇంటిపై దాడి

    Pawan Kalyan : హైదరాబాద్ మీర్ పేటలోని లెనిన్ నగర్ లో...

    Urvashi Rautela : పింక్ డ్రెస్ లో ఊర్వశి రౌతేలా.. కేన్స్ 2024లో సందడి చేసిన గ్లామర్ క్వీన్..

    Urvashi Rautela : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్...

    Jr NTR : ఆలయానికి భారీ విరాళం అందించిన యంగ్ టైగర్.. ఎంతంటే?

    Jr NTR : కోట్లాది మంది అభిమానుల చేత ‘మ్యాన్ ఆఫ్...

    Sunrisers Hyderabad : ప్లే ఆఫ్స్ కు సన్ రైజర్స్..  మిగిలిన ఒక్క స్థానం ఎవరికో

    Sunrisers Hyderabad : ఉప్పల్ లో గురువారం జరగాల్సిన గుజరాత్ టైటాన్స్,...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    YS Jagan : ఆందోళనలో  జగన్

    YS Jagan : వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రాజకీయ...

    Jagan : జగన్ సైలెంట్ మోడ్ లోకి ఎందుకు వెళ్లినట్లు..?

    Jagan Silence : ఆంధ్రప్రదేశ్ లో నిన్న (మే 13) పోలింగ్...

    Viral Video : వైసీపీ పాలనపై బాధగా ఉంది.. – సోషల్ మీడియాలో వీడియో వైరల్

    Viral Video : రకరకాల అబద్దాలతో గత ఐదు సంవత్సరాలుగా పాలన...