Nagarjuna sister Naga Sushila : ముఖ సినీ హీరో నాగార్జున గురించి తెలియని వారు లేరు.. ఈయన అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ ను తెలుగు సినీ ఇండస్ట్రీకి అందించి తెలుగు పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారు.. అయితే అలాంటి నాగార్జున సోదరిపై కేసు నమోదు అయ్యింది.
నాగార్జున సోదరి సినీ నిర్మాత నాగ సుశీలపై పోలీసులు కేసు నమోదు చేసారు.. మరి ఈమెపై కేసు నమోదు చేయడానికి కారణం ఏంటంటే.. నాగ సుశీల, మరో 12 మంది తనపై దాడి చేసారని చింతలపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఈ ఫిర్యాదుతో నాగ సుశీల పేరు బయటకు రాగ ఇప్పుడు ఇది వైరల్ అవుతుంది..
మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకోవడంతో నాగ సుశీల విషయం వెలుగులోకి వచ్చింది. శ్రీనివాస్, నాగ సుశీల మధ్య గత కొద్దీ రోజులుగా భూ వివాదం సాగుతుంది. గతంలో వ్యాపార భాగస్వాములుగా ఉండి ఆ తర్వాత గొడవలతో సపరేట్ అయ్యారు.. ప్రజెంట్ శ్రీనివాస్ శ్రీజ ప్రకృతి దర్సపీఠం నిర్వాహకుడిగా ఉన్నాడు.
ఈ నెల 12న నాగ సుశీల, ఆమె అనుచరులు అతడిపై దాడికి పాల్పడినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.. ఈ విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇక ఇప్పుడే కాదు గతంలో కూడా ఈ ఇద్దరి ఆస్తుల వివాదాలు బయటకు వచ్చి రచ్చ రచ్చ చేసాయి.. 2017లో తన అనుమతి లేకుండా భూములు అమ్మడిని ఆరోపిస్తూ అతడిపై నాగ సుశీల పోలీసులకు ఫిర్యాదు చేసింది.