41.1 C
India
Monday, May 20, 2024
More

    Chandrababu Prove Innocent : ఆ ఏడింట్లో చంద్రబాబు గెలిచేనా.. నిర్దొషి గా నిరూపించుకునే వీలుందా..?

    Date:

    Chandrababu Prove Innocent
    Chandrababu Prove Innocent

    Chandrababu Prove Innocent : ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా సాగతున్నాయి. ఎన్నికలకు సరిగ్గా ఆరు నెలల ముందు ప్రతిపక్ష నేతను ఇబ్బంది పెట్టడమే పరిగా ఏపీ ప్రభుత్వం పావులు కదిపింది. టీడీపీ అధినేత చంద్రబాబును వరుస కేసులతో ఇబ్బంది పెడుతున్నది. ఇప్పటికే స్కిల్ స్కాం కేసులో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించింది. మధ్యంతర బెయిల్ తో ఆయన మంగళవారం బయటకు వచ్చారు.

    అయితే ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు ఏపీ సీఐడీ ముందుకెళ్తున్నదనే అభిప్రాయం ప్రజలందరిలో కలుగుతున్నది. టీడీపీ శ్రేణులు కూడా ఇదే ఆరోపిస్తున్నాయి. దీంతో పాటు ఫైబర్ నెట్ కేసు, అంగళ్లు కేసు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, తాజాగా మధ్యం కేసు అంటూ వివిధ కేసులతో ముప్పు తిప్పలు పెడుతున్నది. అయితే ప్రత్యేకంగా ఆధారాలేం లేకున్నా అభియోగాలు మోపుతూ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నది.

    స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో ఎఫ్ఐఆర్ లో పేరు లేకున్నా చంద్రబాబును ఏపీ సీఐడీ అరెస్ట్ చేసింది. ఆ తర్వాత పేరు ఎంట్రీ చేసింది. ఇక ఏసీబీ కోర్టులో పలు పిటిషన్లు దాఖలు చేస్తూ ఎన్నికల వరకు ఆయనను ప్రజల్లోకి వెళ్లేందుకు లేకుండా చేయాలనే తలంపుతోనే ప్రభుత్వ పెద్దలు వెనుక ఉండి ఇదంతా నడిపిస్తున్నారనే వాదన తెరపైకి వస్తున్నది. కొంతకాలంగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజల్లోనే ఉంటున్నారు. దీంతో 53 రోజులుగా ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉంచింది.

    ఏసీబీ కోర్టు తీర్పుతో చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. మరి వరుస కేసులతో ఇబ్బంది పెట్టాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుండగా, ఇక వీటి నుంచి చంద్రబాబు ఎలా బయట పడుతారో వేచి చూడాల్సి ఉంది. న్యాయ పోరాటం లో ఆయన నెగ్గుకు వస్తారని శ్రేణులు ఆశగా ఎదురు చూస్తున్నాయి. చివరకు గెలిచేది న్యాయమే అంటూ అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా 73 ఏండ్ల వయస్సులో పెద్దాయనను ఇబ్బంది పెడుతున్నారని, రాజకీయంగా ఎదుర్కొలేక అభియోగాలు మోపుతూ కుట్రలు చేస్తున్నారని మండిపడుతున్నారు. వైసీపీకి, ఆ పార్టీ అధినేతకు తెలిసింది ఇది మాత్రమేనని అభిప్రాయపడుతున్నారు.

    Share post:

    More like this
    Related

    IT Raids : నోట్ల కట్టలే పరుపు.. ఆ ఇంట్లో డబ్బే డబ్బు

    IT Raids : పేదవాడు డబ్బు సంపాదించడం కోసం రెక్కలు ముక్కలు...

    Jr NTR : ‘మ్యాన్ ఆఫ్ మాస్’కు అల్లు అర్జున్, మహేష్, చరణ్ శుభాకాంక్షలు..

    Jr NTR Birthday : ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో కలిసి...

    Uyyuru Lokesh : వేటు పడుతున్నా మారని అధికారుల తీరు.. అరాచకాలకు హద్దు లేదా ?

    Uyyuru Lokesh : ఏపీలో వైసీపీ పాలనలో జరిగిన అరాచకాలు ఒక...

    IPL 2024 Playoffs : ప్లే ఆఫ్స్ కు వర్షం అంతరాయం.. రిజర్వ్ డే

    IPL 2024 Playoffs : కోల్ కతా  నైట్ రైడర్స్ రాజస్థాన్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    AP Elections 2024 : ఒకరికి ఆశ.. మరొకరికి నిరాశ ..

    AP Elections 2024 : ఎన్నికల సమయంలో ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా లు...

    Chandrababu : ఓటేసిన వారిని జగన్ కాటేస్తాడు: చంద్రబాబు

    Chandrababu : ఓటేసిన వారిని కాటేసే రకం జగన్ దని నారా...

    Chandrababu : శవ రాజకీయాలు వైసీపీ డిఎన్ఎ లో ఉన్నాయి.. వైసీపీ సర్కార్ ను ఏకీపారేసిన చంద్రబాబు నాయుడు..

    Chandrababu : పెన్షన్ల విషయంలో వైసిపి ప్రభుత్వం ప్రజల ప్రాణాలు తీస్తోందని...

    Chandrababu Bail : చంద్రబాబు బెయిల్ రద్దు.. పిటీషన్ పై విచారణ..

    Chandrababu Bail : టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పిటిషన్ పై...