Chiranjeevi మెగాస్టార్ చిరంజీవి ప్రజెంట్ తన భార్య సురేఖతో కలిసి అమెరికా పర్యటనలో ఉన్నారు.. ఈయన తన చేతిలో ఉన్న షూటింగ్స్ ను కంప్లీట్ చేసుకుని సతీ సమేతంగా కలిసి అమెరికా వెళ్లారు.. వారు అమెరికా వెళుతున్నప్పటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అయ్యాయి.. తాజాగా భోళా శంకర్ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకున్నారు.
ఈ క్రమంలోనే వరుసగా షూటింగ్ ప్లగిన్ ఆయన రిలాక్స్ అవ్వడం కోసం అమెరికా వెళ్లారని మళ్ళీ అతి త్వరలోనే వచ్చి కొత్త సినిమా స్టార్ట్ చేస్తారని అనుకున్నారు.. అయితే ఇప్పుడు ఒక వార్త నెట్టింట వైరల్ అయ్యింది. మెగాస్టార్ చిరంజీవి రిలాక్స్ అవ్వడం కోసం అమెరికా వెళ్లలేదని.. ఒక సర్జరీ కోసం వెళ్లారని తెలుస్తుంది.
చిరంజీవి తన కాలుకి సర్జరీ చేయించు కోవడానికి అమెరికా వెళ్లినట్టు టాక్ వచ్చింది.. ఈ విషయం బయటకు రావడంతో మెగా ఫ్యాన్స్ అంతా షాక్ అవుతున్నారు.. ఇక మరో వార్త ప్రకారం ఆయన వెళ్ళింది విహారయాత్రకే అని పనిలో పని సర్జరీ కూడా చేయించుకుని వస్తారని కూడా అంటున్నారు..
ఇక ఈయన సినిమాల విషయానికి వస్తే.. ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో మంచి హిట్ అందుకున్న మెగాస్టార్ ప్రస్తుతం డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ సినిమా చేస్తున్నాడు.. తమిళ్ లో సూపర్ హిట్ అయిన వేదాళం సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు 11న రిలీజ్ కానుంది.. చూడాలి ఈ సినిమా ఎంత హిట్ అవుతుందో..
ReplyForward
|