31.6 C
India
Sunday, May 19, 2024
More

    Chandrayaan-3 : చంద్రయాన్ -3 వ్యయం ఆదిపురుష్ కంటే తక్కువే తెలుసా?

    Date:

    Chandrayaan-3 Aadipursh
    Chandrayaan-3 Aadipursh

    Chandrayaan-3 : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో రూపొందించిన చంద్రయాన్ -3 విజయవంతంతో ఎన్నో మైలురాళ్లు దాటింది. స్వదేశీ పరిజ్ణానంతో నిర్మించిన చంద్రయాన్ -3 బడ్జెట్ కూడా తక్కువే. గతంలో ప్రభాస్ హీరోగా నిర్మించిన ఆదిపురుష్ కంటే తక్కువే అంటే ఆశ్చర్యకరమే. ఆదిపురుష్ దాదాపు రూ. 700 కోట్లు ఖర్చు చేసినట్లు వ్యాపార వర్గాలు తెలిపాయి. అదే చంద్రయాన్ -3 కోసం ఇస్రో రూ.615 కోట్లు ఖర్చు చేయడం గమనార్హం. ఇలా మన వ్యాపారం మనకు లాభాలే తెస్తోంది.

    ఇటీవల వస్తున్న హాలీవుడ్ సినిమాలు సైతం మన చంద్రయాన్ -3 కంటే ఎక్కువ బడ్జెట్ ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా నిర్మించిన బార్బీ సినిమా కోసం రూ. 1197 కోట్లు ఖర్చు చేశారు. ఓపెన్ హైమర్ కోసం రూ. 625 కోట్లు పెట్టారు. ఇవి చంద్రయాన్ -3 కంటే ఎక్కువే. అణుబాంబు కనుగొన్న శాస్త్రవేత్త జీవితం ఆధారంగా ఈ సినిమా నిర్మించారు దర్శకుడు క్రిస్టఫర్ నోలన్. పదేళ్ల కిందటే ఇంటర్ స్టెల్లార్ పేరుతో అంతరిక్ష విశేషాలతో రూపొందించిన సినిమా వ్యయం రూ.1362 కోట్లు.

    ఇలా ఈ సినిమాల నిర్మాణ వ్యయం చూస్తుంటే చంద్రయాన్ -3 కంటే అత్యధిక రెట్లు కావడం విశేషం. 2015లో వచ్చిన అంతరిక్ష ప్రయాణ ప్రభావిత హాలీవుడ్ చిత్రం ది మాషన్ వ్యయం కూడా రూ. 875 కోట్లు అంటే చంద్రయాన్ -3 వ్యయం ఎంత తక్కువో తెలుస్తూనే ఉంది. ఇలా మన అంతరిక్ష సంస్థ చేస్తున్న పని వల్ల మన దేశానికి ఎంతో పేరు వచ్చింది.

    మన సినిమాల వ్యయం ఇంతలా పెరిగిపోయింది. కానీ అవి సక్సెస్ కాకపోతే భారీ నష్టం సంభవిస్తుంది. ఇప్పుడు చంద్రయాన్ -3 విజయవంతంతో మన కష్టం అంతా మరచిపోయాం. కానీ ఆదిపురుష్ నష్టం ఆ నిర్మాతకు కన్నీరే మిగిల్చింది. ఈ నేపథ్యంలో మన సినిమాల కన్నా మన ఇస్రో పనితనమే బెటర్ అనే వాదనలు వస్తున్నాయి. ఈ క్రమంలో మన బడ్జెట్ మనకు ఎంత ప్రఖ్యాతులు తీసుకువచ్చిందో తెలుస్తూనే ఉంది.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mission Gaganyaan : ‘గగన్‌ యాన్’ స్టార్ట్ అయిన కాసేపటికే మంటలు.. అసలు ఏమైంది..?

    Mission Gaganyaan : చంద్రయాన్ 3 సక్సెస్ తర్వాత మరో మార్స్...

    Chandrayaan 3 Updates : చంద్రయాన్ 3 ముగిసినట్లేనా..? సన్నగిల్లుతున్న ఆశలు

    Chandrayaan 3 Updates : ఇస్రో చేపట్టిన చంద్రయాన్ 3 చంద్రుడి దక్షిణ...

    Chandrayaan-3 Scientists : చంద్రయాన్-3 సక్సెస్ కు కృషి చేసిన శాస్త్రవేత్తల సాలరీలు ఎంతో తెలుసా?

    Chandrayaan-3 Scientists : ఇస్రో మూన్ మిషన్ చంద్రయాన్ 3 ఆగస్ట్...

    Pragyan Rover : ‘సెంచరీ’ కొట్టిన రోవర్‌! 100 మీటర్లకు పైగా ప్రయాణం..

    Pragyan Rover : చంద్రయాన్‌ 3 మిషన్‌కు సంబంధించి రోవర్‌ ప్రజ్ఞాన్ జాబిల్లిపై...