Benefits Of Crowder peas :
మనం తీసుకునే రోజువారీ ఆహారంలో ధాన్యాలు ఉండాలని చెబుతుంటారు. ఇందులో అలసంలు లేదా బొబ్బర్లు చాలా ముఖ్యమైనవి. వీటిని కౌ పీస్, బ్లాక్ ఐడ్ బఠాణీలు, దక్షిణ బఠాణీలు, క్రౌడర్ బఠాణీలు అని కూడా పిలుస్తుంటారు. ఇవి నల్ల మచ్చతో ఓవల్ ఆకారంలో ఉండటం చూస్తుంటాం. క్రీమీ వైట్, రెడ్, బ్రౌన్, బ్లాక్ రకాల్లో లభిస్తాయి. ఆసియా, ఆఫ్రికా దేశాల్లో ఈ పంటలు పండుతాయి. ఫీల్డ్ బీన్స్ అని కూడా అంటారు. వీటి ఉపజాతుల్లో యార్లాంగ్ బీన్స్, క్యాట్టాంగ్ బఠాణీలు, చైనా బీన్స్, ఫీల్డ్ బీన్స్ అని రకరకాలుగా పిలవడం సహజమే.
ఇవి కొలెస్ట్రాల్ ను కరిగిస్తాయి. ఫైబర్, ప్రొటీన్ బాగా ఉండటంతో రక్తంలో ప్లాస్మాలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. ఫైటో స్టెరాల్స్ అనే స్టెరాయిడ్ సమ్మేళనాలు ఉంటాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచి ఆహారంగా నిలుస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. మెల్లిటస్ ప్రమాదాన్ని తగ్గించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి.
లిగ్నిన్ అనే పదార్థం ఉండటం వల్ల బీపీ, గుండెపోటు, ఎముకల వ్యాధులు వంటివి రాకుండా చేయడంలో సాయపడతాయి. వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యం బాగుంటుంది. రోగాలు రాకుండా చేయడంలో ఇవి ఎంతో ఉపకరిస్తాయి. ఈనేపథ్యంలో బొబ్బర్లు తింటూ మన దేహాన్ని ఆరోగ్యంగా తయారు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడింది.
ధాన్యాలతో మనకు మంచి ప్రయోజనాలు దక్కుతాయి. మన ఆరోగ్యం కోసం మంచి ఆహారాలను తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. బొబ్బర్లు తింటూ మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. లేకపోతే మనం రోగాల బారిన పడే ప్రమాదం ఉంటుంది. దీంతో వీటిని రోజు తినేందుకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. అలసందలు తింటే మనకు కొన్ని రకాల వ్యాధులు దూరమవుతాయి.