Signs Of Liver Damage :
మన శరీరంలో నిరంతరం పనిచేసే అవయవాల్లో గుండె ముఖ్యమైనది. తరువాత స్థానాల్లో కాలేయం, మెదడు వంటివి ఉంటాయి. ఈ నేపథ్యంలో లివర్ చెడిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుంది. కాలేయం పాడయిపోతే కొన్ని లక్షణాలు మనకు కనిపిస్తాయి. రక్తం నుంచి టాక్సిన్లు కాలేయం నుంచి బయటకు పంపిస్తుంది. కాలేయం సరిగా పనిచేయకపోతే మనకు కనిపించే లక్షణాలు ఏమిటో చూద్దాం.
శరీరంపై దద్దుర్లు, దురదలు వస్తుంటాయి. చర్మం పాడైనట్లు కనిపిస్తుంది. లోపల వ్యర్థాలు బయటకు పోకపోతే మన కళ్లు, చర్మం పసుపు రంగులోకి మారుతుంది. మలం రంగు కూడా పేల్ కలర్ లో కనిపిస్తుంది. మూత్రం రంగు కూడా మారుతుంది. కాలేయం పనిచేయకపోతే వాంతులు, విరేచనాలు వస్తుంటాయి. తల తిరుగుతూ ఉంటుంది.
మనం తిన్న ఆహారం జీర్ణం కాక పోషకాలను గ్రహిస్తుంది. దీంతో దెబ్బలు తగిలినప్పుడు చర్మం కింద రక్తస్రావం అయినట్లు మచ్చలు కనిపిస్తాయి. సాలెగూడు మాదిరి చర్మంపై మచ్చలు వస్తాయి. ఈ సంకేతాలను గమనిస్తే కాలేయం పనితీరు మందగించిందని గుర్తించాలి. వెంటనే చికిత్స తీసుకోవాలి. లేకపోతే లివర్ పూర్తిగా డ్యామేజ్ అయితే బతకడం కష్టమవుతుంది.
కాలేయం పాడుకాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మద్యానికి దూరంగా ఉండాలి. మద్యం తాగడం వల్ల లివర్ పూర్తిగా చెడిపోతుంది. నాణ్యమైన మంచినూనెనే వాడాలి. కల్తీ నూనెతో జాగ్రత్తగా ఉండాలి. ఉదయం నిద్ర లేచిన తరువాత మల మూత్రాలు విసర్జించాలి. లేకపోతే లివర్లో వ్యర్థాలు పేరుకుపోయి కాలేయం చెడిపోయేందుకు కారణంగా నిలుస్తుంది. ఇంకా మందులు అతిగా తీసుకున్నా లివర్ చెడిపోయేందుకు అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులొస్తాయి.