34.4 C
India
Thursday, May 16, 2024
More

    Chandrababu-BJP : బీజేపీకి ఎన్ని సీట్లు ఇవ్వడానికి చంద్రబాబు అంగీకరించారో తెలుసా?

    Date:

    seats Chandrababu agreed to give to BJP?
    how many seats Chandrababu agreed to give to BJP?

    Chandrababu-BJP : ఆంధ్రప్రదేశ్ లో పొత్తులు ఖాయంగా కనిపిస్తున్నాయి. టీడీపీ, జనసేన ఇప్పటికే కూటమిగా ఏర్పడ్డాయి. ఇందులో బీజేపీ కూడా చేరుతుందని అనుకుంటున్నారు. సంకేతాలు కూడా వస్తున్నాయి. సీట్ల సర్దుబాటు విషయంపైనే తర్జనభర్జనలు కొనసాగుతున్నాయి. బీజేపీ ఎక్కువ సీట్లు అడిగే అవకాశం ఉంది. దీంతో పొత్తు ఖరారవుతుందా? లేక విడిగానే పోటీ చేస్తాయా? అనేది తేలాల్సి ఉంది.

    ఏపీలో అధికార మార్పిడికి గల అవకాశాలను వినియోగించుకోవాలని చంద్రబాబు చూస్తున్నారు. అందివచ్చే దేన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేరు. జగన్ ను గద్దె దించడమే ఆయన ధ్యేయం. దాని కోసం ఎంత దాకా అయినా వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే జనసేనతో పొత్తు పెట్టుకున్నారు. ఇక బీజేపీని కూడా కలుపుకుని జగన్ ను గద్దె దింపాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు.

    జనసేన మొదట 40 సీట్లు అడిగినా బీజేపీ కూడా కలుస్తుండటంతో ఆ సంఖ్యను 25కు తగ్గించుకునేందుకు పరిమితం కానుందని సమాచారం. బీజేపీకి కూడా 25 అసెంబ్లీ, 10 ఎంపీ స్థానాలు కావాలని కోరుతోంది. చంద్రబాబు 6 ఎంపీ, 15 అసెంబ్లీ స్థానాలు ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో పొత్తుల విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయాలు ఉంటాయో తెలియడం లేదు.

    ఇందులో భాగంగా అరకు, విశాఖపట్నం, ఏలూరు లేదా రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, రాజంపేట ఎంపీ స్థానాలు బీజేపీకి ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకారం తెలిపినట్లు చెబుతున్నారు. విశాఖ నుంచి జీవీఎల్ నరసింహారావు, రాజమండి నుంచి పురంధేశ్వరి, విజయవాడ నుంచి సుజనా చౌదరి, రాజంపేట నుంచి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పోటీలో ఉంటారని అంటున్నారు.

    ఎమ్మెల్యే స్థానాల్లో అరకు, విశాఖ ఉత్తరం, శ్రీకాకుళం, కాకినాడ సిటీ, రాజమండ్రి సిటీ, ఉంగుటూరు/తాడేపల్లి గూడెం, కైకలూరు, విజయవాడ సెంట్రల్, శ్రీకాళహస్తి, మదనపల్లె, జమ్మలమడుగు, ధర్మవరం, గుంతకల్, ఒంగోలు, ప్రత్తిపాడు నియోజకవర్గాలున్నాయని చెబుతున్నారు.

    Share post:

    More like this
    Related

    Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం.. ట్రాఫిక్ జామ్

    Hyderabad Rain : హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షం పడుతోంది....

    Hyderabad News : పెంపుడు కుక్క విషయంలో ఘర్షణ – కుక్కతో పాటు ముగ్గురికి తీవ్రగాయాలు

    Hyderabad News : హైదరాబాద్ లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధి...

    Kavya Thapar : డబుల్ ఇస్మార్ట్ హీరోయిన్ గా కావ్య థాపర్?

    Kavya Thapar : తెలుగులో ‘ఒక మినీ కథ’, ఇటీవల ‘ఊరు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    YS Jagan : ఆందోళనలో  జగన్

    YS Jagan : వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రాజకీయ...

    Jagan : జగన్ సైలెంట్ మోడ్ లోకి ఎందుకు వెళ్లినట్లు..?

    Jagan Silence : ఆంధ్రప్రదేశ్ లో నిన్న (మే 13) పోలింగ్...

    Viral Video : వైసీపీ పాలనపై బాధగా ఉంది.. – సోషల్ మీడియాలో వీడియో వైరల్

    Viral Video : రకరకాల అబద్దాలతో గత ఐదు సంవత్సరాలుగా పాలన...

    Women Voters : ఓటెత్తిన మహిళలు.. కలిసొచ్చేది ఎవరికో..?

    Women Voters : ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ జాతరను తలపిస్తున్నది. పోలింగ్...