Agarbatti : మనం రోజు ఉదయాన్నే దేవుడికి పూజలు చేస్తుంటాం. అగర్ వత్తీలు వెలిగించి దేవుడికి చూపిస్తాం. దేవుడు మన కోరికలు తీర్చాలని వేడుకుంటాం. ఇందులో భాగంగానే అగర్ వత్తులు వెలిగిస్తాం. అగర్ వత్తులు ఎక్కువగా వాడటం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు సూచిస్తున్నారు. ఈనేపథ్యంలో అగర్ వత్తులు పరిమితంగా వాడటమే మంచిది.
అగర్ వత్తులు వాడకం వల్ల దగ్గు, ఆస్తమా, ఎలర్జీలు, తలనొప్పి లాంటి సమస్యలు కూడా ఎదురవుతాయి. దీనికి తోడు ఇటీవల కాలంలో రసాయనాలు కలిపిన పదార్థాలతో తయారు చేయడం వల్ల దాని పొగ పీల్చుకోవడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయి. రసాయనాలు ఉపయోగించడం వల్ల మన ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.
అగర్ వత్తుల్లో కార్బన్ మోనాక్సైడ్ వంటి ప్రమాదకర వాయువులు వెలువడుతుంటాయి. వాటిని పీల్చడం వల్ల ఆరోగ్యం పాడైపోయే అవకాశం ఉంటుంది. అందుకే వీలైనంత వరకు అగర్ వత్తులు ఎక్కువగా వాడకపోవడమే మంచిది. దాని పొగ ఎక్కువగా పీల్చితే మనకు నష్టమే. దీన్ని గమనించుకుని పరిమితంగానే వాడుకోవడం వల్ల మనకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి.
అగర్ వత్తుల వాడకంతో మన ఆరోగ్యానికి ఎలాంటి ముప్పు రాకుండా ఉండాలంటే జాగ్రత్తలు తీసుకోవాలి. ఇష్టమొచ్చినట్లు వాడితే కష్టాలు వస్తాయి. అగర్ వత్తులు ఎంత పరిమితంగా వాడితే అంత ప్రయోజనం కలుగుతుంది. అగర్ వత్తుల వాసన బాగుందని వాడటం వల్ల మనకే తిప్పలు వస్తాయి. దీంతో వాటి వాడకం తగ్గించి మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటే మేలు.