37.8 C
India
Saturday, May 18, 2024
More

    YouTube channel : యూ ట్యూబ్ ఛానల్ తో కోట్ల సంపాదన.. ఎలా సాధ్యమంటే?

    Date:

    YouTube channel
    YouTube channel

    YouTube channel : ప్రస్తుతం సోషల్ మీడియా జమానా నడుస్తోంది. వీడియోలూ, ఫొటోలూ షేర్‌ చేస్తూ వాటకి వచ్చే  లైకులు, కామెంట్లు చూసి మురిసిపోవడం చేస్తున్నారు ఇప్పటి జనరేషన్. కానీ దీన్నే సోషల్‌ మీడియా వేదికగా మార్చుకుంటే.. కాలక్షేపమే క్యాష్‌ అవుతుందంటున్నారు యూ ట్యూబర్లు. వయసుతో ఎలాంటి సంబంధం లేకుండా మంచి కంటెంట్ ను ఎంచుకొని ఇన్‌ఫ్లుయెన్సర్లుగా కోట్లు గడిస్తున్నారు. ఇలాంటి కొంత మంది టాప్‌ యూట్యూబర్ల గురించి తెలుసుకుందాం.

    యూ ట్యూబ్ లో 4 కోట్లకు పైగా సబ్ స్క్రైబర్లు ఉన్న ఛానల్‌ ‘క్యారీమినాటీ’. దీని యజమాని అజయ్‌ నాగర్‌. హరియాణాలోని ఫరీదాబాద్‌ వాసి. హాస్యం, వ్యంగ్యం, వీడియో గేములకు సంబంధించి వీడియోలతో ఈ ఛానళ్లను నడుపుతున్నాడు. పదేళ్లకే గేమింగ్‌ వీడియోలతో యూట్యూబ్ లో అడుగుపెట్టాడు. దాన్నే కెరీర్‌గా మలచుకొని డిస్టెన్స్ లో చదువుకున్నాడు. తక్కువ కాలంలో 3 కోట్ల సబ్ స్క్రైబర్లతో దేశంలో ఆ మైలురాయిని దాటిన మొదటి యూట్యూబర్‌గా చరిత్రకెక్కాడు. ఈ 25 సంవత్సరాల కుర్రాడు యాడ్స్, స్పాన్సర్ల ద్వారా సంపాదించిన సంపాదన రూ.50 కోట్లు.

    కామెడీ ఇన్‌ఫ్లుయెన్సర్‌!
    మహారాష్ట్ర వాసి ఆశిష్‌ చంచ్లానీకి నటనంటే ఇష్టం. ఇంజినీరింగ్‌ చేసిన ఈ కుర్రాడు 2014లో ‘ఆశిష్‌ చంచ్లానీ వైన్స్‌’ పేరుతో ఛానల్‌ ప్రారంభించాడు. వీడియోలు చేస్తూనే బాలీవుడ్‌ మూవీస్ ప్రమోషన్‌, ఈవెంట్లకు వెళ్లేవాడు. బెస్ట్‌ కామెడీ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మరేందుకు ఆశిష్‌కు ఎంతో కాలం పట్టలేదు. తమాషా మాటలు, నవ్వు పుట్టించే కాన్సెప్ట్‌తో 3 కోట్ల 30 లక్షల మంది సబ్ స్క్రైబర్లను సంపాదించాడు. యూట్యూబ్‌ స్టార్‌గా అవార్డులు అందుకున్నాడు. ఇతని సంపాదన రూ.41 కోట్లు.

    ఒక్క వీడియోతో మొదలు
    ఢిల్లీకి చెందిన భువన్‌ లిరిక్ రైటర్, సింగర్, యాక్టర్ కూడా. కశ్మీర్‌ వరదల్లో కొడుకును కోల్పోయిన తల్లిని విలేకరి ప్రశ్నిస్తున్న తీరును భువన్‌ యూట్యూబ్ లో షేర్‌ చేశాడట. అది వైరల్‌ అవ్వడంతో తానే యూట్యూబ్‌ ఛానల్‌ పెట్టాలనుకున్నాడు. అలా 2015లో షార్ట్‌ కామెడీ వీడియోలతో ఛానల్‌ పెట్టి 2.50 కోట్లకుపైగా సబ్‌స్క్రైబర్లను సంపాదించుకున్నాడు. 30 ఏళ్ల భువన్‌ రూ.122 కోట్లు ఆర్జించాడు. ఫ్యాషన్‌ దుస్తుల కంపెనీలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా కూడా పనిచేస్తున్నాడు.

    టెక్‌ గురూ!
    ఏ ఫోన్‌ కొనాలి.. ఏ కారు మంచిది.. డిజిటల్‌ స్కామ్‌ జాగ్రత్తలపై ఎన్నో విషయాల్ని చెప్తూ టెక్నికల్‌ గురూజీగా మారాడు 32 సంవత్సరాల గౌరవ్‌ చౌధురి. రాజస్థాన్‌లోని అజ్మేర్‌కు చెందిన గౌరవ్‌ తండ్రితో కలిసి దుబాయ్‌ వెళ్లి అక్కడ పని చేస్తూనే మైక్రో ఎలక్ట్రానిక్స్‌ చదివాడు. తనకచ్చిన సందేహాలను తీర్చుకునేందుకు యూట్యూబ్‌ ఛానల్ నే వాడుకునేవాడు. అలా టెక్నాలజీపై పట్టుసాధించిన గౌరవ్ 2015లో సొంతంగా ఛానల్‌ పెట్టాడు. 2.50 కోట్ల సబ్ స్క్రైబర్లను కలిగిన గౌరవ్‌ రూ.350 కోట్లకుపైనే సంపాదించి దేశంలో రిచెస్ట్‌ యూట్యూబర్లలో ఒకడిగా నిలిచాడు.

    ఆ నవ్వులకే… కోట్లు!
    30 ఏళ్ల అమిత్ భడానా కామెడీ వీడియోలతో 2.50 కోట్ల మందికి నవ్వులు పంచుతున్నాడు. ఢిల్లీకి చెందిన అమిత్‌ డబ్బింగ్‌ వీడియోలతో 2017లో యూట్యూబ్‌ ఛానల్‌ పెట్టాడు. ‘ఎగ్జామ్‌ బీ లైక్‌’ అంటూ ఫన్నీ వీడియో చేసి పోస్ట్ చేయగా వైరల్ అయ్యింది. లక్షల్లో వ్యూస్‌ తెచ్చింది. వెనక్కి తిరిగి చూసుకోకుండా హ్యూమర్‌తో పాటు పేరడీ పాటలు పాడుతూ వీడియోలు చేస్తున్నాడు. యూట్యూబ్‌ ద్వారా అమిత్‌కి రూ.50 కోట్లకుపైనే ఆదాయం వచ్చింది.

    64 ఏళ్ల షెఫ్‌!
    ఉత్తర్‌ప్రదేశ్‌ (యూపీ)కి చెందిన నిశామధులికది కుకింగ్‌ వీడియోల ఛానల్‌. ‘వంటా-వార్పులో ప్రావీణ్యం ఉన్నవారు చాలా మంది ఇలాంటివి చేస్తున్నారు కదా మరి విశేషమేముందీ’ అంటే.. నిశా వయసు 64 సంవత్సరాలు కోటిన్నర సబ్ స్క్రైబర్లును కలిగి ఉన్న ఆమె రూ. 43 కోట్లు అర్జిస్తుంది. మొదట్లో నిశా శాకాహార వంటల బ్లాగు రాసేవారు. వాటికి గుర్తింపు రావడంతో 2009లో కుకింగ్‌ ఛానల్‌ పెట్టి కొనసాగిస్తున్నారు. యూట్యూబ్‌ కుకింగ్‌ కంటెంట్‌ క్రియేటర్‌ అవార్డు అందుకున్నారు.

    ఇంకా ఈ వరసలో చాలామంది ఉన్నారు. ఆలోచింపచేసే మాటలు, సరదా పాటలు, స్ఫూర్తి నిచ్చే పాఠాలు, నోరూరించే వంటలు, రాజకీయ విశ్లేషణలు, ట్రెండింగ్ టాపిక్స్, ఫ్యాషన్లు.. ఇలా ఏదో ఒక అంశాన్ని ఎంచుకొని స్టయిల్ తో అటు పేరూ ఇటు డబ్బూ సంపాదిస్తున్నారు.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related